NTV Telugu Site icon

Winter Foods to Eat: చల్లగా ఉందని వేడి వేడిగా బజ్జీలు, పకోడీలు చిరుతిళ్లు లాగిస్తున్నారా?

Street Foods

Street Foods

తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.. చలితో ప్రజలు వణికిపోతున్నారు.. ఇక, అల్లూరి జిల్లా ఏజెన్సీలో చలి వణుకు పుట్టిస్తుంది. రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కి పడిపోయాయి. ఏజెన్సీ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు కురుస్తుంది. మినుములూరులో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవగా.. పాడేరులో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దట్టమైన పొగమంచు, శీతల గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఈ సమయంలోనే వేడి వేడి బజ్జీలు, పకోడీలు, చిరుతిళ్లు తినుకుంటారు. కానీ ఇలాంటివి తినడం వల్ల చలికాలం శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల వంటి ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, చిన్న చిన్న జాగ్రత్తలతో వీటిని చాలా వరకూ అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు. ఆహారం మీద శ్రద్ధ పెడితే నిరోధకశక్తినీ పెంచుకోవచ్చని అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

READ MORE: CM Chandrababu: మహిళలపై అఘాయిత్యాలు.. సీఎం సీరియస్‌ వార్నింగ్‌

చలిని ఎదుర్కోవటానికి శరీరానికి అధిక శక్తి అవసరం. శక్తిని అందించడంలో ఆహారం పాత్ర కీలకం. కాబట్టి చలికాలంలో కాస్త ఎక్కువగా తినాల్సి ఉంటుంది. మిర్చీబజ్జీల వంటి చిరుతిళ్ల వైపు మళ్లుతుంటుంది. అయితే జంక్‌ఫుడ్‌తో బరువు పెరిగే ప్రమాదం పెరుగుతుంది. దీంతో పాటు చాలా రోగాలు సైతం వస్తాయి. కాబట్టి చలికాలంలో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రొటీన్లు, పిండి పదార్థాలు, కొవ్వులు శరీరానికి శక్తిని అందిస్తాయి. అయితే.. జీవక్రియల కోసం విటమిన్‌ సి, విటమిన్‌ ఇ, విటమిన్‌ ఎ, విటమిన్‌ డి బాగా తోడ్పడతాయి. కాలుష్య కారకాలు హాని చేయకుండా నిలువరిస్తాయి. కాబట్టి నిమ్మకాయ, బత్తాయి, నారింజ, జామ పండ్ల వంటివి ఎక్కువగా తీసుకోవాలి. బత్తాయి తింటే, నిమ్మరసం తాగితే జలుబు చేస్తుందనే అపోహలు వీడాలని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఎరుపు క్యాప్సికం, పసుపు క్యాప్సికం, కీరా, క్యాబేజీలోనూ విటమిన్‌ సి ఉంటుంది. ఈ సీజన్​ లో లభించే ఉసిరిలో కూడా విటమిన్‌ సి మోతాదు ఎక్కువే ఉంటుంది. ఇంకా ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికి జింక్‌ కూడా అవసరం. ఇది చిక్కుళ్లు, గుమ్మడి విత్తనాలు, మాంస పదార్థాల్లో ఉంటుంది. ఇప్పుడు జింక్‌ కలిపిన పదార్థాల ఉత్పత్తులూ మార్కెట్​లో అందుబాటులో ఉంటున్నాయి. గుడ్డు పచ్చసొన, బొప్పాయి, క్యారెట్, గుమ్మడికాయ, చిలగడ దుంప, ఆకుకూరలతో విటమిన్‌ ఎ లభిస్తుంది.