Heart Attack: చలికాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ.. కారణాలు ఇవే..
- రోజు రోజుకూ పెరుగుతున్న చలి
- చుట్టుముడుతున్న అనారోగ్య సమస్యలు
- శీతాకాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ
- ఈ సీజన్లో గుండెపై అధిక ఒత్తిడి
- ఈ జాగ్రత్తలు తీసుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చలి తీవ్రత నానాటికి పెరుగుతోంది. ఈ సీజన్ వస్తే చాలు అనారోగ్యాలు చుట్టుముడుతుంటాయి. మరోవైపు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి కారణాలతో మరణించే వారి సంఖ్య కూడా చలికాలంలోనే ఎక్కువగా ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే.. ఇతర సీజన్లతో పోలిస్తే శీతాకాలంలో గుండెపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. గుండె సంబంధిత సమస్యలు ఉన్న వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే.. ఈ సీజన్‌లో గుండెపోటు పెరగడానికి గల కారణాల గురించి తెలుసుకుందాం..
ఉష్ణోగ్రతలు తగ్గిపోవటానికీ, గుండె జబ్బులకీ మధ్య సంబంధం..
వాతావరణ ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గిపోవటానికీ, గుండె జబ్బులకీ మధ్య సంబంధం ఉందని స్వీడన్‌లోని లండ్ విశ్వవిద్యాలయం పరిశోధనలు మరోసారి నిరూపించారు. ముఖ్యంగా చలికాలంలో.. ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే తగ్గినప్పుడు ఈ ముప్పు మరింతగా పెరుగుతోందని వీరు నిర్ధారణకు వచ్చారు. ఇలా ఉష్ణోగ్రతలు సున్నా కంటే కిందికి పడిపోయినప్పుడు.. ఒక్క రోజులోనే గుండెపోటు వచ్చే ముప్పు నాలుగు రెట్లు పెరుగుతోందట. సూర్మరశ్మి తక్కువగా ఉండటం, చల్లగాలులు తీవ్రంగా వీచటం, వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం.. ఇలాంటి పరిస్థితుల్లో మన శరీరంలో ఉష్ణోగ్రతను నెగ్గుకొచ్చే శక్తి తగ్గిపోయి.. ఆ ప్రభావం నేరుగా ఒంట్లోని అవయవాల మీద పడుతోంది. (థర్మల్ కండక్షన్). దీంతో రక్తనాళాలు చలికి ప్రతిస్పందించి.. ధమనుల్లో రక్తపోటు పెరిగిపోయి.. తీవ్రమైన వణుకు, గుండెపోటు రావడానికి ఆస్కారం ఉంటోందని గుర్తించారు. కాబట్టి గుండె సమస్యలున్నవాళ్లు ఈ చలికాలంలో.. నేరుగా చలిలోకి వెళ్లకుండా కాస్త వెచ్చటి వాతావరణంలో ఉండేందుకు ప్రయత్నించటం ఉత్తమం!
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
తగినంత నీటిని తాగడం ద్వారా మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో నుంచి మలినాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేందుకు నీరు అవసరం. తగినంత నీరు తాగడం వల్ల మీ గుండె తన విధులను సక్రమంగా నిర్వర్తించగలుగుతుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీటిని తప్పక తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. మీ గుండె పటిష్టంగా ఉంటుంది. మీ సంపూర్ణ ఆరోగ్యానికి భరోసా ఉంటుంది. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయండి. ఆరోగ్యకరమైన, సమతులమైన ఆహారం తీసుకోవాలి. యాంటిఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజలవణాలు, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఒత్తిడి మీ గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. మీ ఒత్తిడిస్థాయిలను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. గుండె జబ్బులకు ప్రధాన కారణం పొగ తాగడం. స్మోకింగ్ ఆపేస్తే మీ గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?