NTV Telugu Site icon

Hair Growth: జుట్టు చివర్లను కత్తిరిస్తే.. వేగంగా పెరుగుతుందా?

Hair Growth

Hair Growth

Hair Growth: పొడవాటి, అందమైన, నల్లటి జుట్టును ఎవరు కోరుకోరు? అయితే ఈ రోజుల్లో జుట్టు సమస్యలు పెరిగిపోతున్నాయి. వాయు కాలుష్యం, కెమికల్స్ షాంపూలు, నూనెలు, డీహైడ్రేషన్, అనారోగ్యకరమైన ఆహారం కారణంగా చాలా మంది జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలడం, చుండ్రు, పొడిబారడం, జుట్టు చిట్లడం, గరుకుగా మారడం వంటి సమస్యలతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. అంతే కాకుండా జుట్టు చివర్లను కొద్దిగా కత్తిరించుకుంటే పొడవుగా పెరుగుతుందని భావించే వారు చాలా మంది ఉన్నారు.

Read also: Viral Video: ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్‌లో తాతయ్య రచ్చ.. మంచి రొమాంటిక్‌ డైరెక్టర్‌ అయ్యేవాడేమో..!

కటింగ్ వల్ల నిజంగా జుట్టు పెరుగుతుందా?

ఇలా నెలకో రెండు, మూడు నెలలకో ఒకసారి కచ్చితంగా జుట్టు కత్తిరించేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఇలా జుట్టు కత్తిరించుకుంటే పొడవుగా పెరుగుతుందని అంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జుట్టు కత్తిరించడం వల్ల అది అస్సలు పెరగదు. జుట్టు పెరగడం అనేది కేవలం మన భ్రమ మాత్రమేనని నిపుణులు తేల్చారు. జుట్టు కత్తిరించడం, దాని పెరుగుదల మధ్య ఎటువంటి సంబంధం లేదని నిపుణులు నిర్ధారించారు. ఎందుకొ మీకు తెలుసా? జుట్టు ఫోలికల్స్ నుండి మాత్రమే పెరుగుతుంది. అంటే నెత్తిమీద నుంచి. అదే జుట్టు చివర్ల నుండి కాదు. అందుకే మీ జుట్టును కత్తిరించడం వల్ల అది పొడవుగా మరియు ఆరోగ్యంగా పెరుగుతుందనేది పెద్ద అపోహ. నిజానికి జుట్టు కత్తిరించడం వల్ల జుట్టు అందంగా కనిపిస్తుంది. అది చక్కని ఆకృతి. మన జుట్టు నెలకు 1 సెంటీమీటర్ల చొప్పున పెరుగుతుందని మీకు తెలుసా? కానీ జుట్టు కూడా అప్పుడప్పుడు పాడవుతుంది. అలాగే మనం రోజుకు 50 నుంచి 100 వెంట్రుకలు రాలిపోవడం చాలా సహజం. వెంట్రుకల జీవితకాలం ముగియడంతో, అవి రాలిపోయి కొత్తవి పుడతాయి. కానీ చివర్లను కత్తిరించడం వల్ల డ్యామేజ్ అయిన జుట్టు తొలగిపోతుంది. జుట్టు అందంగా మారుతుంది.

Read also: BIG Breking: చెన్నై ద్రౌపది దేవి ఉత్సవాల్లో అపశృతి.. భక్తులపై క్రేన్‌ పడటంతో నలుగురు మృతి

జుట్టు కత్తిరించుకోకూడదా?

హెయిర్ కటింగ్.. కురుల ఎదుగుదలకు ఎటువంటి సంబంధం లేనప్పటికీ, ట్రిమ్ చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. మీకు పొడవైన అందమైన జుట్టు కావాలంటే ఇది చాలా ముఖ్యం. పగిలిన, దెబ్బతిన్న జుట్టును కత్తిరించడం వలన మీ జుట్టు ఆరోగ్యంగా.. మందంగా కనిపిస్తుంది. జుట్టు కత్తిరించడం వల్ల ఆరోగ్యంగా పెరుగుతుంది.. అయితే ఎన్ని రోజులు జుట్టు కత్తిరించుకోవాలి? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, రెగ్యులర్ హెయిర్ ట్రిమ్మింగ్ మీ హెయిర్ కేర్ రొటీన్‌లో భాగంగా ఉండాలి. ఎందుకంటే దీని వల్ల జుట్టు సమస్యలు రావు. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఈ ఫ్రీక్వెన్సీ మీ జుట్టు రకం మరియు జుట్టు శైలిపై ఆధారపడి ఉంటుంది. మీ జుట్టు బాగా ఒత్తుగా ఉంటే, మృదువుగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి 2 నుండి 3 నెలలకు ఒకసారి కత్తిరించాలని నిపుణులు అంటున్నారు. కానీ జుట్టును ఎప్పుడు కత్తిరించాలనే దానిపై ఎటువంటి నియమం లేదు. అయితే అవి ఎంతకాలం కావాలనే దానిపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కానీ మీరు 3-4 నెలలకు ఒకసారి మీ జుట్టును కత్తిరించుకోవచ్చు. అయితే, ఎంత జుట్టు కత్తిరించినా తిరిగి పెరుగుతుంది.
Secunderabad Fire Accident: సికింద్రాబాద్ అగ్నిప్రమాదం.. మృతదేహాలు ఎందుకు కనిపించలేదు?