Ragi Sarva Pindi: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. తెలంగాణ స్పెషల్ ‘రాగి పిండి సర్వపిండి’.. ఇలా ట్రై చేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Sarva Pindi: తెలంగాణలో సర్వపిండికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. స్నాక్స్‌గా లేదా బ్రేక్‌ఫాస్ట్‌గా దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఆరోగ్య స్పృహ ఉన్నవారి కోసం, డయాబెటిస్ లేదా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారి కోసం ‘రాగి పిండి’తో చేసే సర్వపిండి ఒక అద్భుతమైన ఆప్షన్. సాధారణంగా బియ్యం పిండితో చేసుకునే ఈ వంటకాన్ని మరింత ఆరోగ్యకరంగా మార్చుతూ, ‘రాగి పిండి’తో ఎలా తయారు చేసుకోవాలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
రాగి పిండి – 1 కప్పు
Also Read
- Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
బియ్యం పిండి – 1 కప్పు
తరిగిన ఉల్లిపాయ ముక్కలు – 1 మీడియం సైజ్
పచ్చిమిర్చి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
కరివేపాకు, కొత్తిమీర – తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
శనగపప్పు (నానబెట్టినది) – 2 టేబుల్ స్పూన్లు
నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర – 1 టీస్పూన్
ఉప్పు – రుచికి తగినంత
నూనె – తగినంత
తయారీ విధానం..
ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో రాగి పిండి, బియ్యం పిండి వేయాలి. దీనికి తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్, నానబెట్టిన శనగపప్పు, నువ్వులు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీరను జత చేయాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి, కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా సర్వపిండి వేసుకోవడానికి వీలుగా కలుపుకోవాలి. సర్వపిండి వండుకోవడానికి వెడల్పాటి గిన్నె లేదా కడాయి తీసుకుని దానికి నూనె రాయాలి. కలిపి పెట్టుకున్న పిండిని ఒక ముద్దలా తీసుకుని గిన్నె అడుగు భాగంలో పల్చగా సమానంగా ఒత్తుకోవాలి.
పిండిని ఒత్తిన తర్వాత మధ్యమధ్యలో చిన్న చిన్న రంధ్రాలు చేసి, ఆ రంధ్రాల్లో కొద్దిగా నూనె వేయాలి. ఇలా చేయడం వల్ల పిండి లోపల వరకు సమానంగా కాలుతుంది. గిన్నెపై మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద సుమారు 5 నుంచి 10 నిమిషాల పాటు కాల్చుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. పైన ఆవిరితో పిండి ఉడికి, కింద క్రిస్పీగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన తెలంగాణ స్పెషల్ రాగి పిండి సర్వపిండి రెడీ అయిపోయింది. దీనిని చల్లారిన తర్వాత తింటే మరింత కరకరలాడుతూ రుచిగా ఉంటుంది.
రాగి సర్వపిండితో ప్రయోజనాలు..
నిజానికి రాగి సర్వపిండి రుచిలో మాత్రమే కాదు, ఆరోగ్య పరంగా కూడా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. అన్ని రకాల తృణధాన్యాల కంటే రాగుల్లో కాల్షియం అత్యధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చడానికి, పిల్లల ఎదుగుదలకు, వయసు పైబడిన వారిలో వచ్చే ఎముకల వ్యాధులను అరికట్టడానికి సహాయపడుతుంది. రాగుల్లో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉంటుంది, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రణలో ఉంటాయి. ఇందులోని అధిక పీచు పదార్థం వల్ల ఇది తిన్న తర్వాత కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. దీనివల్ల అతిగా తినడం తగ్గి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి స్నాక్ ఆప్షన్‌గా మారుతుంది.
రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి, రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఎంతో మేలు జరుగుతుంది. వేసవి కాలంలో రాగులతో చేసిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. మండే ఎండల్లో వేడిని తట్టుకోవడానికి రాగి సర్వపిండి ఒక మంచి పోషకాహారం. రాగుల్లో ఉండే అమైనో ఆమ్లాలు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. తక్కువ నూనెతో కాల్చుకోవడం వల్ల ఇది గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. సర్వపిండిలో మనం వాడే నువ్వులు, శనగపప్పు ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, మంచి కొవ్వులు అందుతాయి.
తాజావార్తలు
-
Sai Pallavi in Kalki 2: కల్కి 2లో దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవి..?
-
CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్‌తోనే పోటిపడుతున్నాం..
-
Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్‌ల ద్వారానే..
-
AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
-
The Raja Saab : సంక్రాంతి విలన్.. రాజా సాబ్ పోస్ట్ మార్టం ఫెయిల్?
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!