Family Planning : ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ఈ టెస్టులు మస్ట్!
- గర్భధారణకు ముందు ప్రీ-కన్సెప్షన్ చెకప్స్ ఎందుకు ముఖ్యం?
- మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన హార్మోన్, ఇమ్యూనిటీ టెస్టులు
- పురుషులకు కూడా కీలకమే.. సీమెన్ అనాలిసిస్ ఎందుకు అవసరం?
- హెల్తీ ప్రెగ్నెన్సీ కోసం వైద్యుల కీలక సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Family Planning : నేటి ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రీ-మెచ్యూర్ డెలివరీలు (నెలలు నిండకుండానే కాన్పు అవ్వడం), మిస్క్యారేజ్ (గర్భస్రావం) కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలనుకునే దంపతులు తమ జీవితంలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంటున్నట్లే లెక్క. అయితే, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి కంటే ముందే ‘ప్రీ-కన్సెప్షన్ చెకప్స్’ అంటే గర్భధారణకు ముందు చేయించుకునే పరీక్షలు ఎంతో ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అసలు మన శరీరం ప్రెగ్నెన్సీకి పూర్తిగా సిద్ధంగా ఉందా లేదా అని తెలుసుకోవడం, సరైన సమయంలో కొన్ని బేసిక్ మెడికల్ టెస్టులు చేయించుకోవడం వల్ల సులభంగా గర్భం దాల్చడమే కాకుండా, ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే అనేక రకాల ఆరోగ్య రిస్క్‌లను కూడా ముందే తగ్గించుకోవచ్చు.
మహిళల శరీరం గర్భధారణ సమయంలో 9 నెలల పాటు ఎన్నో రకాల శారీరక, హార్మోన్ల మార్పులకు లోనవుతుంది. అందుకే మహిళలు ప్రెగ్నెన్సీకి ముందే ‘హార్మోనల్ ప్రొఫైల్’ చెక్ చేయించుకోవాలి. ఇందులో థైరాయిడ్ (TSH), ప్రొలాక్టిన్ , ఏఎంహెచ్ (AMH) టెస్టులు ప్రధానమైనవి. ముఖ్యంగా ఏఎంహెచ్ టెస్ట్ ద్వారా మహిళల అండాశయంలో అండాల సంఖ్య (Ovarian Reserve) ఎంత ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. వీటితో పాటు హీమోగ్లోబిన్, ఐరన్ లెవెల్స్ పరీక్షించడం కూడా చాలా అవసరం. ఎందుకంటే మనదేశంలో చాలా మంది మహిళల్లో రక్తహీనత (Anemia) సమస్య సాధారణంగా కనిపిస్తుంది, ఇది ప్రెగ్నెన్సీ సమయంలో తీవ్ర నీరసానికి, బలహీనతకు దారితీస్తుంది. అలాగే కాబోయే బిడ్డకు గర్భంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండటానికి రుబెల్లా, చికెన్‌పాక్స్ వంటి వ్యాధులకు సంబంధించిన ఇమ్యూనిటీ స్క్రీనింగ్ కూడా మహిళలు ముందుగానే చేయించుకోవాలి.
Also Read
- Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
- TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
- Women's Health : 40 ఏళ్లకే మెనోపాజ్.? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
- Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే 'రాగి బిస్కెట్లు'.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
సాధారణంగా ఫ్యామిలీ ప్లానింగ్ లేదా ఫర్టిలిటీ అనగానే అది కేవలం మహిళలకు మాత్రమే సంబంధించిన విషయమని చాలా మంది భావిస్తుంటారు, కానీ ఈ ఆలోచన పూర్తిగా తప్పు అని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తండ్రి కావాలనుకునే పురుషులు కూడా తమ ఆరోగ్యంపై సమానంగా శ్రద్ధ పెట్టాలి. పురుషుల కోసం చేసే అత్యంత ప్రాథమిక, ముఖ్యమైన పరీక్ష ‘సీమెన్ అనాలిసిస్’ (వీర్య కణాల పరీక్ష). దీని ద్వారా స్పెర్మ్ కౌంట్, వాటి ఆకృతి, , కదలికల (Movement) సామర్థ్యం ఎలా ఉందో తెలుస్తుంది. ఒకవేళ ఈ రిపోర్టులో ఏవైనా లోపాలు కనిపిస్తే, సరైన డైట్ , వైద్య చికిత్స ద్వారా వాటిని సులభంగా సరిదిద్దవచ్చు. వీటితో పాటు డయాబెటిస్ (షుగర్), హై బ్లడ్ ప్రెజర్ (బీపీ) వంటి లైఫ్‌స్టైల్ వ్యాధుల పరీక్షలు కూడా పురుషులకు అవసరం, ఎందుకంటే ఇవి నేరుగా ఫర్టిలిటీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి.
ఈ బేసిక్ మెడికల్ టెస్టులతో పాటు ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉన్న దంపతులకు వైద్యులు కొన్ని కీలకమైన సూచనలు చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి కొన్ని నెలల ముందే మహిళలు డాక్టర్ సలహాతో ‘ఫోలిక్ యాసిడ్’ సప్లిమెంట్లను తీసుకోవడం ప్రారంభించాలి, ఇది పుట్టబోయే బిడ్డ మెదడు, వెన్నెముక ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది. అలాగే భార్యాభర్తల్లో ఎవరికైనా స్మోకింగ్ లేదా ఆల్కహాల్ తీసుకునే అలవాట్లు ఉంటే వాటిని వెంటనే పూర్తిగా మానేయాలి, ఎందుకంటే ఇవి ఫర్టిలిటీని తీవ్రంగా దెబ్బతీసి గర్భధారణకు అడ్డంకిగా మారుతాయి. కాబట్టి, హెల్తీ ప్రెగ్నెన్సీ , ఆరోగ్యకరమైన బిడ్డ కోసం దంపతులిద్దరూ ముందే డాక్టర్‌ను కలిసి ఈ స్క్రీనింగ్స్ చేయించుకోవడం ఎంతో ఉత్తమం.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..