Saltలో ఈ ఒక్క మార్పు చేయండి.. లక్షలాది ప్రాణాలు కాపాడండి! పరిశోధనలో కీలక విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి కిచెన్‌లో ఉప్పు ఉండాల్సిందే.. అయితే ఆ ఉప్పే ఎన్నో ప్రాణాలను తీస్తుందంటూ ఓ అధ్యయనం షాకింగ్ విషయాలు బయటపెట్టింది.. ఉప్పు వాడకంలో చిన్న మార్పు.. లక్షలాది మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉందంటోంది.. సాధారణ ఉప్పులోని సోడియం క్లోరైడ్లో కొంత భాగాన్ని పొటాషియం క్లోరైడ్‌తో భర్తీ చేసి తయారు చేసే పొటాషియం సమృద్ధి ఉప్పుతో గుండె, మూత్రపిండాల వ్యాధులను గణనీయంగా తగ్గించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ మార్పు ద్వారా భారత్‌లో ఏటా సుమారు 4 లక్షల మరణాలను, గుండె సంబంధిత, మూత్రపిండాల వ్యాధులకు సంబంధించిన 15 లక్షలకు పైగా కొత్త కేసులను నివారించవచ్చని పరిశోధకులు అంచనా వేశారు.
ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మరణాలు నివారించే అవకాశం
193 దేశాల్లోని పరిస్థితులను పరిశీలించిన ఈ అధ్యయనం Nature Health జర్నల్‌లో ప్రచురితమైంది. ప్రపంచవ్యాప్తంగా సాధారణ ఉప్పు స్థానంలో పొటాషియం కలిపిన ఉప్పును వినియోగిస్తే ఏటా దాదాపు 29.6 లక్షల మరణాలను నివారించవచ్చని పరిశోధకులు అంచనా వేశారు. అలాగే గుండె సంబంధిత వ్యాధులు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులకు సంబంధించిన 1.017 కోట్ల కొత్త కేసులను అడ్డుకోవచ్చని వెల్లడించారు. ఈ మార్పు వల్ల ఏటా సుమారు 6.943 కోట్ల డిసేబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ (DALYs) తగ్గే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది.
Also Read
- Healthy Breakfast: బియ్యం లేకుండానే క్రిస్పీ జొన్న దోశలు.. షుగర్, బరువు నియంత్రణకు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్!
- Care Health Insurance పాలసీదారులకు షాక్.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ చికిత్స నిలిపివేత.!
- Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే 'సన్న కారపూస'.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
- Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
అధిక సోడియం.. తక్కువ పొటాషియంతో ఆరోగ్య సమస్యలు
ఆహారంలో సోడియం అధికంగా తీసుకోవడం, పొటాషియం తక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఆ అధ్యయనం వెల్లడించింది.. హైబీపీ కారణంగా గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో సాధారణ ఉప్పులో కొంత సోడియంను తగ్గించి, దాని స్థానంలో పొటాషియం కలపడం ద్వారా ఈ రెండు ఆహార సమస్యలను ఒకేసారి పరిష్కరించవచ్చని ఆస్ట్రేలియాలోని జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్‌కు చెందిన సీనియర్ పరిశోధకుడు బ్రూస్ నీల్ తెలిపారు.. చాలా దేశాల్లో గుండె సంబంధిత మరణాల్లో పదో వంతు వరకు ఈ మార్పుతో నివారించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇంట్లో వాడే ఉప్పు మార్చినా భారీ ప్రయోజనాలు
పరిశోధకులు వివిధ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అధ్యయనం చేశారు. ఇంట్లో వంటకు ఉపయోగించే సాధారణ ఉప్పును మాత్రమే పొటాషియం సమృద్ధి ఉప్పుతో మార్చినా ఏటా 18.5 లక్షల మరణాలను, గుండె సంబంధిత, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులకు సంబంధించిన 62 లక్షల కేసులను నివారించవచ్చని అంచనా వేశారు. మరోవైపు, ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగించే ఉప్పును మాత్రమే మార్చినా 15.6 లక్షల మరణాలు, 54.6 లక్షల వ్యాధి కేసులను అడ్డుకోవచ్చని అధ్యయనం వెల్లడించింది. ఇంట్లో వాడే ఉప్పుతో పాటు ప్రాసెస్డ్ ఫుడ్, రెస్టారెంట్ ఆహారాల్లో ఉపయోగించే ఉప్పును కూడా మార్చగలిగితే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. సాధారణ ఉప్పులాగే పొటాషియం కలిపిన ఉప్పు కూడా కనిపిస్తుందని, రుచి, వంటలో వినియోగం పరంగా పెద్దగా తేడా ఉండదని తెలిపారు.
WHO కూడా ఇదే సూచిస్తోంది
సోడియం వినియోగాన్ని తగ్గించడం ద్వారా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే సూచించింది. సాధారణ టేబుల్ సాల్ట్ స్థానంలో తక్కువ సోడియం కలిగిన పొటాషియం ఆధారిత ఉప్పు ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని సిఫార్సు చేస్తోంది. దీనివల్ల అధిక రక్తపోటు, ఇతర అసంక్రమిత వ్యాధుల భారాన్ని తగ్గించవచ్చని పేర్కొంటోంది. మందుల ద్వారా చికిత్స చేయడంతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే ఎక్కువ మందికి ఆరోగ్య ప్రయోజనాలు అందించే అవకాశం ఉందని బ్రూస్ నీల్ అభిప్రాయపడ్డారు. అయితే పొటాషియం కలిపిన ఉప్పును అందరూ విచక్షణ లేకుండా ఉపయోగించకూడదని పరిశోధకులు హెచ్చరించారు. ముఖ్యంగా తీవ్రమైన మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారిలో రక్తంలో పొటాషియం స్థాయులు అధికమయ్యే ప్రమాదం ఉంది. దీనిని హైపర్కలేమియా (Hyperkalaemia) అంటారు. రక్తంలో పొటాషియం అధికమైతే ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. మొత్తంగా.. సాధారణ ఉప్పు స్థానంలో పొటాషియం సమృద్ధి ఉప్పును వినియోగించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుండె, మూత్రపిండాల వ్యాధుల ముప్పును తగ్గించవచ్చని ఈ అధ్యయనం సూచిస్తోంది.
తాజావార్తలు
-
Saltలో ఈ ఒక్క మార్పు చేయండి.. లక్షలాది ప్రాణాలు కాపాడండి! పరిశోధనలో కీలక విషయాలు
-
CM Chandrababu: ఏపీకి భారీ పెట్టుబడులే లక్ష్యం.. SIPBలో చంద్రబాబు కీలక ఆదేశాలు
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Measles: గాల్లో వైరస్..30ఏళ్ల తర్వాత అదే ముప్పు!
-
Basil Joseph: ఆఫర్స్ లేక కాదు.. కావాలనే యాక్టింగ్‌కు బ్రేక్.. బాసిల్ పెద్ద ప్లానే!
ట్రెండింగ్
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!