NTV Telugu Site icon

Cancer: 40 ఏళ్లలోపు భారతీయుల్లో క్యాన్సర్ ముప్పు.. ఫుడ్, లైఫ్ స్టైల్‌లే కారణం..

Cancer

Cancer

Cancer: ఒక్కప్పుడు క్యాన్సర్ అనే వ్యాధిని చాలా అరుదుగా చూసేవారం. కానీ ఇప్పుడు మాత్రం పలు రకాల క్యాన్సర్లు ప్రజల్ని పట్టిపీడిస్తున్నాయి. ముఖ్యం యువత క్యాన్సర్ల బారిన పడటం ఆందోళనల్ని పెంచుతోంది. భారతదేశంలో 40 ఏళ్ల లోపు వారిలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు ఆదివారం తెలిపారు. దీనికి మన ఆహార అలవాట్లు, జీవనశైలి కారణాలుగా చెబుతున్నారు.

ప్రాసెస్ చేసిన ఫుడ్, పొగాకు, ఆల్కాహాల్ అధిక వినియోగం, ఊబకాయం, ఒత్తిడి క్యాన్సర్లకు ప్రధాన కారణాల్లో ఒకటి. దీనికి తోడు పర్యావరణ కాలుష్యం కూడా మరో అంశం. భారతదేశంలోని వివిధ నగరాల్లో అధిక స్థాయి కాలుష్యం వివధ రకాల క్యాన్సర్లతో ముడిపడి ఉంది. గాలి, నీటి కాలుష్యం క్యాన్సర్ కారకాలుగా ఉన్నాయి. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం, శ్రమ లేని జీవనశైలి భారతీయ యువతతో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతోంది.

Read Also: Removing Lice: తలలో పేనులు పోవాలంటే ఈ చిట్కాలు పాటించండి..!

అనారోగ్యకరమైన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సంక్షోభాన్ని సృష్టిస్తోదని అని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లోని హెమటాలజీ మరియు BMT విభాగం డైరెక్టర్ మరియు హెడ్ డాక్టర్ రాహుల్ భార్గవ చెప్పారు. ఈ ధోరణి నుంచి బయటపడాలంటే ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, చురుకైన జీవనశైలి చాలా అవసరమని అన్నారు. ఢిల్లీకి చెందిన క్యాన్సర్ ముక్త్ భారత్ ఫౌండేషన్ ఇటీవల అధ్యయనం ప్రకారం.. భారతదేశంలో 20 శాతం క్యాన్సర్ కేసులు ఇప్పుడు 40 ఏళ్ల లోపువారిలో నిర్ధారణ అవుతున్నాయని తేలింది. ఇందులో పురుషులు 60 శాతం ఉండగా, మహిళలు 40 శాతం ఉన్నట్లు తెలిపింది.

పొగాకు వినియోగంతో పాటు ఉద్యోగరీత్యా బయటి వాతావరణాకి ఎక్కువగా గురికవాడం, జీవనశైలి వంటి కారణాలు బాధితుల్లో పురుషులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. స్వచ్ఛమైన గాలి మరియు నీరు, సాధారణ శారీరక శ్రమ మరియు పౌష్టికాహారానికి ప్రాప్యతను ప్రోత్సహించే విధానాలకు తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు కోరుతున్నారు.