Diwali 2024: దీపావళి రోజు ఈ సమస్యల వల్ల కళ్ళకు ప్రమాదం.. జాగ్రత్తగా లేకపోతే..?
- దీపావళి రోజు ఆరోగ్యంతో పాటు కంటి భద్రతపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
- దీపావళి సందర్భంగా పెరుగనున్న కాలుష్యం స్థాయి
- ఆ కాలుష్యం ఇళ్లలోకి కూడా చేరి కళ్లను ప్రభావితం
- కళ్ళను రక్షించుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి పండగ అంటే దీపాల వెలుగులు.. పటాకుల మోత.. ఇవి లేకుండా దీపావళి పండుగ అసంపూర్ణం.. అయితే దీపావళి పండుగను ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అయితే.. దీపావళి రోజు ఆరోగ్యంతో పాటు కంటి భద్రతపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే దీపావళి సందర్భంగా కాలుష్యం స్థాయి ఎక్కువగా పెరుగుతుంది. ఆ కాలుష్యం ఇళ్లలోకి కూడా చేరి కళ్లను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో కళ్ళను రక్షించుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా పటాకుల పొగ, కాలుష్యం కారణంగా కంటి చూపు కోల్పోయిన చాలా మంది ఉంటారు.
దీపావళి సందర్భంగా కళ్లలో మంట, ఎర్రబడడం, నీళ్లు కారడం వంటి సమస్యలు ఎక్కువగా నమోదవుతాయి. కంటి వైద్యుల సలహాలను పాటించడం, దీపావళి సందర్భంగా ఈ కంటి సంరక్షణ చిట్కాలను పాటించడం చాలా ముఖ్యం. దీపావళి సందర్భంగా పటాకుల వల్ల కళ్లకు తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. దాదాపు ప్రతి బాణసంచా నుంచి వేడి స్పార్క్‌లను విడుదల చేస్తుంది. వాటి నుండి విడుదలయ్యే పొడి కంటికి తీవ్రమైన ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ క్రమంలో.. దీపావళి నాడు కంటి రక్షణ కోసం ఆరోగ్య నిపుణులు కొన్ని సూచనలు ఇచ్చారు.
Also Read
- Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ 'జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు'.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
- PCODతో ఇబ్బందా.? మెంతులు-దాల్చినచెక్క టీతో ఇన్సులిన్ బ్యాలెన్స్.!
- Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే 'మష్రూమ్ ఆనియన్ పకోడీ'.! చేసేయండి ఇలా..
- Dr Mohan Rao Patibandla: గుంటూరు వైద్యుడికి అంతర్జాతీయ వేదికపై త్రివిజయం.. ఒకే సదస్సులో మూడు పురస్కారాలు!
దీపావళి సమయంలో కంటి సమస్యలు
దీపావళి సందర్భంగా భారీ సంఖ్యలో బాణసంచా కాల్చుతుంటారు. క్రాకర్ల వల్ల కళ్ళకు చాలా ప్రమాదకరం. పటాకుల్లో సీసం అనే మూలకం ఉండటం వల్ల కళ్లతో పాటు హృద్రోగులకు కూడా ప్రమాదకరం.
కంటి చికాకు ప్రమాదం
దీపావళి సందర్భంగా పటాకుల పొగతో వాయు కాలుష్యం భారీగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో కళ్ళకు అసౌకర్యం, పొడి కళ్ళుగా మారిపోతాయి. అలాగే.. కళ్లలో నొప్పి, ఎరుపుగా మారుతాయి. సున్నితమైన కళ్ళు లేదా డ్రై ఐ సిండ్రోమ్ వంటి వ్యాధులు ఉన్న వ్యక్తులు దీపావళి సమయంలో సరిగ్గా చూడటంలో ఇబ్బందిని ఎదుర్కొంటారు.
అలెర్జీ కాన్జూక్టివిటిస్
దీపావళి సమయంలో దుమ్ము, వాయు కాలుష్యం వల్ల కలిగే అత్యంత సాధారణ సమస్యలలో ఇది ఒకటి. ఈ సమస్యలో కళ్ళు ఎర్రగా మారడం, దురద, కనురెప్పలు ఉబ్బడం.. చూడటంలో ఇబ్బంది ఉంటుంది.
తాజావార్తలు
-
Varanasi: తెలుగు మీడియాని లైట్ తీసుకున్న జక్కన్న
-
Iran-US War: అమెరికాపై ఇరాన్ వ్యూహం మారిందా? కొత్త లక్ష్యం ఇదేనా!
-
FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
-
Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
-
Ram Pothineni: పాండిచ్చేరిలో RAPO 23
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!