Deep Sleep: గాఢ నిద్ర లేకపోతే పక్షవాతం, అల్జీమర్స్ ముప్పు.. తాజా అధ్యయనంలో వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deep Sleep: నిద్ర అనేది మానవ శరీరానికి చాలా అవసరం. మన దినచర్యలో భాగం. నిద్ర మన శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితుల్లో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. శరీరం నిద్రలో ఉన్నప్పుడు కూడా మెదడు చురుకుగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు నిరూపించాయి. ఇదిలా ఉంటే గాఢ నిద్ర తగ్గే కొద్ది పక్షవాతం, అల్జీమర్స్ వ్యాధితో పాటు మతిమరుపు సమస్యలు పెరుగుతాయని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ యొక్క మెడికల్ జర్నల్ అయిన న్యూరాలజీలో ఈ కొత్త పరిశోధన ప్రచురించబడింది.
‘‘స్లీప్ అప్నియా’’ మెదడులో మార్పులకు కారణం అవుతుందని అధ్యయనం నిరూపించింది. స్లీప్ అప్నియా అనేది తీవ్రమైన స్లీప్ డిజార్డర్. దీంట్లో శ్వాస పదేపదే ఆగిపోయి ప్రారంభమవుతుంది. మీరు గరక పెట్టడం, పూర్తిగా రాత్రి విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా అలసిపోయినట్లు అనిపిస్తే మీకు స్లీప్ అప్నియా వచ్చే అవకాశం ఉంది. మెదడులోని తెల్లగా ఉండే పదార్థంలో బ్రెయిన్ బయోమార్కర్లు ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని తెలియపరుస్తాయి. ఈ బయోమార్కర్లు సెరెబ్రోవాస్కులర్ వ్యాధికి సంబంధించిన సంకేతాలను ఇస్తాయి. మెదడులో ఈ మార్పులకు ప్రస్తుతం చికిత్స లేదని అందువల్ల, ఇలాంటివి జరగకుండా నిరోధించడానికి మార్గాలు కనుగొనాలని పరిశోధకులు తెలిపారు.
Also Read
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
Read Also: Congress: మరో విపత్తుకు నాంది.. రూ. 2000 నోట్ల రద్దుపై ప్రధాని లక్ష్యంగా కాంగ్రెస్ విమర్శలు..
ఈ అధ్యయనంలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో బాధపడుతున్న 140 మంది పాల్గొన్నారు, పాల్గొనేవారి సగటు వయస్సు 73 సంవత్సరాలు. అధ్యయనం ప్రారంభంలో పాల్గొన్న వారికి ఈ అధ్యయనంలో పాల్గొనే ముందు వారికి మతిమరుపు, ఏకాగ్రత, కొత్త విషయాలను నేర్చుకోలేకపోవడం వంటి సమస్యలు లేవు. వీరలో 34 శాతం మంది తేలికపాటి, 32 శాతం మంది మధ్యస్థ, 34 శాతం మంది తీవ్రమైన స్లీప్ అప్నియా ఉంది. వీరంతా ఎంత సేపు గాఢ నిద్రలో ఉన్నారనే విషయాలను అధ్యయనం పరిశీలించింది. తేలికపాటి, మధ్యస్థ స్లీప్ అప్నియాతో ఉన్నవారి కన్నా తీవ్రమైన స్లీప్ అప్నియాతో ఉన్నవారిలో మెదడులోని వైట్ మ్యాటర్ లో హైపర్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వారి మెదడుల్లో నాడీ కణాలను అనుసంధానించే అక్సోనల్ ఇంటిగ్రిటీ కూడా తగ్గినట్లు తేలింది. వైట్ మ్యాటర్ హైపర్‌సెన్సివిటీస్ అనేది మెదడు స్కాన్‌లలో కనిపించే చిన్న గాయాలు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో భారత్లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!