Mineral Water: నీరు మన జీవితానికి చాలా అవసరం. మంచి శుభ్రమైన తీరు తాగడం ముఖ్యం. ఎందుకంటే.. కలుషితమైన నీటిలో హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు, పరాన్నజీవులు ఉండవచ్చు. ఈ సూక్ష్మక్రిములు మురికి నీరు, పైపులైన్ లీకేజీ లేదా అపరిశుభ్రమైన నిల్వ కారణంగా వృద్ధి చెందుతాయి. బ్యాక్టీరియా కలిగిన నీటిని తాగడం వల్ల విరేచనాలు, టైఫాయిడ్, కలరా, ఫుడ్ పాయిజనింగ్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాంటి నీటిని ఎక్కువ కాలం తాగడం వల్ల శరీర రోగనిరోధక శక్తి బలహీనపడి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీని ప్రభావం పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిలో మరింత ప్రమాదకరంగా ఉంటుంది. అందువల్ల, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శుభ్రమైన, సురక్షితమైన నీటిని తాగడం చాలా ముఖ్యం. విదిలా ఉండగా.. మినరల్స్ అంటే ఏంటి? అనే అంశాన్ని తెలుసుకుందాం..
READ MORE: Shekhar Kammula : కృష్ణవంశీ నన్ను రిజెక్ట్ చేశాడు.. శేఖర్ కమ్ముల సీక్రెట్ రివీల్..
నీటిలో మినరల్స్ లేకపోతే మనిషి శరీరానికి ఎటువంటి ఉపయోగం ఉండదు. మినరల్ వాటర్ పేరుతో మనం బాటిళ్లతో అమ్మే నీటిని తాగతుంటాం. అసలు భూమి లోపల నుంచి లేదా భూమి ఉపరితలంపై నుంచి లభ్యమయ్యే నీటినే మినరల్ వాటర్ అంటారు. ఇందులో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ ఉంటాయి. ఇందులో మనిషి శరీరానికి కావలసిన దానికంటే తక్కువగానో, ఎక్కువగానో మినరల్స్ ఉంటాయి. ఈ నీటిని తాగితే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం మినరల్ వాటర్ తాగితే శరీరంలో జీర్ణక్రియలకు అసవరమైన మినరల్స్ సమతూకంలో ఉంటాయి. కొన్ని కంపెనీలు ప్లాస్టిక్ లేదా గ్లాస్ బ్యాటిల్స్‌లో మినరల్ వాటర్‌ని అమ్మకాలకు పెడుతున్నాయి. మనలో చాలా మంది ప్రయాణాల్లో తరచూ ఈ నీటిని తాగుతుంటాం. అయితే ఆయా బాటిల్స్‌పై ఉన్న మినరల్స్ లిస్టు.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)తో సరిపోయిందా? లేదా? అనేది చూసుకోవాలి. అయితే ఆ నీటి టీడీఎస్ మాత్రం 500 mg/L దాటకూడదు. ఈ సమాచారాన్ని బట్టి మీరు తాగే నీటిలో మినరల్స్ ఉన్నాయో లేదో ఇప్పుడే తెలుసుకోండి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.