నిశ్శబ్దంగా మనలో చేరి మనతోపాటే జీవితాంతం ఉండేదే డయాబెటిస్. ఈ వ్యాధి ఒక్కసారి మనలో కనిపించిందంటే.. దాన్ని ఒక పూర్తిగా నిరోధించడం కుదరదు. దాన్ని అదుపులో పెట్టుకోవడంపైనే దృష్టి సారించాల్సి ఉంటుంది. 30 ఏళ్ల లోపు వారు కూడా ఈ వ్యాధి బారిన పడటం మరింత ఆందోళన కలిగించే విషయం. రక్తంలో చక్కెరల స్థాయిలను తగ్గించుకునేందుకు మందులు మింగాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయితే.. అందరి మదిలో అన్నం తింటే షుగర్ వస్తుందా? షుగర్ ఉన్న వాళ్లు అన్నం తింటే షుగర్ పెరుగుతుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం…
READ MORE: Jagdeep Dhankhar Resign: ఉపరాష్ట్రపతి పదవికి ధన్ఖడ్ అకస్మాత్తుగా ఎందుకు రాజీనామా చేశారంటే..?
వరి అన్నం విషయంలో మరీ అంత భయం అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. తినడంలో కొన్ని పద్ధతులు, జాగ్రత్తలు పాటించాలని వెల్లడించారు. బియ్యం రకం, మిల్లు ఆడించే పద్ధతిని బట్టి అన్నంలో గ్లైసెమిక్ ఇండెక్స్ (రక్తంలో చక్కెరస్థాయిని కొలిచే సూచిక) విలువలు మారిపోతాయి. ఉదాహరణకు ముడి బియ్యంలో కంటే ఎక్కువగా చక్కెర స్థాయిలు తెల్ల బియ్యంలో ఉంటాయి. బియ్యం పాలిష్ పట్టే సమయంలో బయటి ఊక పొర తొలగించడం వల్ల చక్కెర శాతం పెరుగుతుంది. దేశవాళి బియ్యం, ఎర్ర బియ్యంలో అధిక పీచు, పోషకాలు ఉంటాయి. ఈ కారణంగా తక్కువ చక్కెర స్థాయిలు ఉంటాయి. ఏపీలో ఎక్కువగా వినియోగించే సాంబ మసూరిలో కూడా ఇవి తక్కువగానే ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. అయితే.. రక్తంలో చక్కెర స్థాయి పెరగడానికి వరి అన్నం తినడం మాత్రమే కారణం కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మందిలో శారీరక శ్రమ తగ్గిపోవటం, బేకరీ ఫుడ్స్, జంక్ ఫుడ్ వల్ల పరిస్థితి గాడి తప్పిందని పేర్కొన్నారు. అంతేకాకుండా జీవనశైలిలో వస్తున్న మార్పులు, ఆధునిక పోకడలు దుష్ప్రభావం చూపుతున్నాయని వివరించారు. సకాలంలో తినకపోవడం, రాత్రి మరీ ఆలస్యంగా తినటం, వేగంగా తినటం వల్ల కూడా అనేక రకాల ఇబ్బందులు వస్తాయని తెలిపారు.
READ MORE: Revenge Murder: తల్లిని అవమానించాడని, 10 ఏళ్ల తర్వాత ప్రతీకారం.. సినిమాకు మించిన స్టోరీ..