Ragi Punugulu – Kara Chutney: 10 నిమిషాల్లో రెడీ అయ్యే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. సింపుల్‌గా ఇలా చేసేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Punugulu – Kara Chutney: ఈ రోజుల్లో జనాలకు ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతున్న కొద్దీ, పాతకాలపు చిరుధాన్యాలకు ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా రాగులు ఎముకల బలానికి, రక్తహీనతను తగ్గించడానికి, బరువు తగ్గాలనుకునే వారికి ఒక అద్భుతమైన ఆహారంగా పని చేస్తున్నాయని తెలియగానే వాటిని వారి రోజూ వారి ఆహరంలో భాగం చేసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అయితే ప్రతిరోజూ రాగి జావ లేదా రాగి ముద్ద తినడం కొందరికి బోర్ కొట్టవచ్చు. అలాంటి వారి కోసం, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడేలా, అప్పటికప్పుడు కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో చేసుకునే రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ ‘ఇన్స్టంట్ రాగి పునుగులు’. వీటికి తోడుగా స్పైసీగా ఉండే ‘కారపు చట్నీ’ ఉంటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. తక్కువ నూనెతో, ఎక్కువ పోషకాలతో కూడిన ఈ బ్రేక్‌ఫాస్ట్ తయారీ విధానం ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రాగి పునుగుల కోసం కావలసిన పదార్థాలు:
Also Read
- Puttu Recipe : ఆవిరిపై అమృతం.. కేరళ ఫేమస్ బ్రేక్ ఫాస్ట్ పుట్టు ఇలా ఈజీగా చేసుకోండి..!
- Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ 'పాలక్ పరోటా'.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో 'గోంగూర పులిహోర'.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
- Madatha Kaja Recipe : స్వీట్ షాప్ స్టైల్లో జ్యూసీ మడత కాజాలు ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండిలా.!
రాగి పిండి – 1/2 కప్పు
బొంబాయి రవ్వ – 1/2 కప్పు
పెరుగు – 1/4 కప్పు (కొంచెం పుల్లటిదైతే రుచి బాగుంటుంది)
తురిమిన క్యారెట్ – 1/4 కప్పు
సన్నగా తరిగిన ఉల్లిపాయ – 2 టేబుల్ స్పూన్లు
సన్నగా తరిగిన టమాటా – 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, కరివేపాకు – తగినంత
జీలకర్ర – 1/2 టీస్పూన్
అల్లం తరుగు – 1/2 టీస్పూన్
వంట సోడా – 1/2 టీస్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – కాల్చడానికి సరిపడా
కారపు చట్నీ కోసం:
శనగపప్పు – 1 టీస్పూన్
మినప్పప్పు – 1 టీస్పూన్
జీలకర్ర – 1/2 టీస్పూన్
టమాటా ముక్కలు – 1/2 కప్పు
ఉల్లిపాయ – 1 (పెద్దది)
ఎండుమిర్చి – 4 నుండి 5
అల్లం ముక్క – చిన్నది
వెల్లుల్లి రెబ్బలు – 4 నుండి 5
కారం – 1/2 టీస్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – 2-3 టీస్పూన్లు
తయారీ విధానం..
ముందుగా బొంబాయి రవ్వను బాణలిలో వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో వేయించిన రవ్వ, రాగి పిండి, పెరుగు, తరిగిన కూరగాయలు (ఉల్లిపాయ, టమాటా, క్యారెట్), పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, అల్లం తరుగు, ఉప్పు వేయండి. తర్వాత అవసరమైనన్ని నీళ్లు పోస్తూ ఇడ్లీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 10 – 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల రవ్వ నీటిని పీల్చుకుని మెత్తబడుతుంది. పునుగులు వేసే ముందు మాత్రమే వంట సోడా వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలపాలి. తర్వాత గుంట పునుగుల పానాన్ని స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. తర్వాత ప్రతి గుంటలో కొన్ని చుక్కల నూనె వేయాలి. అనంతరం పిండిని ఆ గుంటల్లో నింపి, పైన మూత పెట్టి తక్కువ మంట మీద 1-2 నిమిషాలు ఉడికించాలి. అడుగు భాగం కాలిన తర్వాత వాటిని వెనక్కి తిప్పి, మరికొంచెం నూనె వేసి రెండో వైపు కూడా దోరగా కాల్చుకోవాలి. అంతే వేడివేడి రాగి పునుగులు రెడీ.
కారపు చట్నీ తయారీ విధానం:
ఒక బాణలిలో శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసి దోరగా వేయించి విడిగా తీసి పెట్టుకోండి. అదే బాణలిలో కొంచెం నూనె వేసి అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గనివ్వండి. అందులోనే ఎండుమిర్చి, టమాటా ముక్కలు, కారం, ఉప్పు వేసి టమాటా మెత్తబడే వరకు ఉడికించాలి. మిశ్రమం చల్లారిన తర్వాత, వేయించిన పప్పులతో కలిపి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. చివరగా ఆవాలు, కరివేపాకు, ఇంగువతో తాలింపు వేసి చట్నీలో కలుపుకుంటే రుచికరమైన కారపు చట్నీ రెడీ. కుదిరితే మీరు కూడా ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని మీ ఇంట్లో తయారు చేసుకోండి.
తాజావార్తలు
-
Ragi Punugulu – Kara Chutney: 10 నిమిషాల్లో రెడీ అయ్యే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. సింపుల్‌గా ఇలా చేసేయండి!
-
Peddi: నైజాంలో రామ్ చరణ్ ‘పెద్ది’కి బిగ్ షాక్
-
Peddi: పెద్ది’కి నార్త్’లో సాలిడ్ బ్యాకప్..ట్రైలర్ లాంచ్ అక్కడే!
-
Keralam: కేరళం సీఎం ఎంపికపై గందరగోళం.. రంగంలోకి సోనియా!
-
Saraswati river: గంగా-యమున మధ్య భూగర్భ నది.. “అదృశ్య సరస్వతి” నదికి ఆనవాళ్లు..
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!