Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
- తల్లిదండ్రుల్లో డయాబెటిస్ ఉంటే పిల్లల్లో వచ్చే ఛాన్స్..
- వ్యాయామం, బరువు నియంత్రణ, సమతుల్య ఆహారంతో చెక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diabetes: ఒకప్పుడు షుగర్ వ్యాధి అంటే 50 ఏళ్లు దాటిన వారికి వచ్చేది అనుకునేవారు. కానీ ఇప్పుడు 25-30 ఏళ్ల లోపే డయాబెటిస్ వస్తోంది. మధుమేహంతో బాధపడే వారి సంఖ్య రోజురోజు పెరుగుతోంది. ఇదిలా ఉంటే, తల్లిదండ్రుల్లో ఎవరికైనా మధుమేహం ఉంటే తమకు కూడా వస్తుందా.? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే, కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర ఉన్నంత మాత్రాన వ్యాధి తప్పకుండా వస్తుందని భావించాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మధుమేహంలో ప్రధానంగా టైప్-1, టైప్-2 రకాలు ఉంటాయి. టైప్-1 సాధారణంగా పుట్టుకతో వస్తుంది. ఈ పరిస్థితిలో శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల ఇలాంటి వారు జీవితాంతం ఇన్సులిన్ తప్పకుండా వాడాల్సి ఉంటుంది. టైప్-1 ఉన్న ప్రతీ ఒక్కరికీ కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర ఉండాల్సిన అవసరం లేదు.
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
అయితే, టైప్-2 డయాబెటిస్ మనం చాలా సాధారణంగా చూసే రకం. తల్లిదండ్రుల్లో ఒకరికి ఈ వ్యాధి ఉంటే తర్వాత తరం వారికి వచ్చే అవకాశాలు ఉంటాయి. శరీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, అధిక బరువు వంటివి టైప్-2కు కారణమవుతాయి. తల్లిదండ్రుల్లో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే, ఇది వచ్చే అవకాశం గణనీయంగా పెరుగుతుంది. తల్లిదండ్రులు ఇద్దరికి ఉంటే ప్రమాదం మరింత పెరుగొచ్చు.
జన్యుపరమైన ప్రభావం ఉన్నంత మాత్రాన డయాబెటిస్ తప్పనిసరిగా వస్తుందని కాదు. చురుకైన జీవనశైలి, నిత్యం వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకోవడం, జీవనశైలిలో మార్పుల వల్ల టైప్-2 డయాబెటిస్‌ను రాకుండా చేసుకోవచ్చు. ఒక వేళ వచ్చినా ఈ నియమాలు పాటిస్తే, మళ్లీ రివర్స్ చేసే అవకాశం ఉంటుంది.
కుటుంబంలో షుగర్ ఉంటే ఏం చేయాలి.?
తల్లిదండ్రుల్లో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే, మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు 45 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, బరువును అదుపులో ఉంచుకోవడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి చేయాలి. కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర ఉన్నవారు తరుచుగా టెస్టులు చేయించుకోవాలి.
తాజావార్తలు
-
Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!