NTV Telugu Site icon

Diabetes: స్వీట్స్ ఎక్కువగా తింటే షుగర్ వ్యాధి సోకుతుందా?

Diabetes Do Not Eat

Diabetes Do Not Eat

నేటి కాలంలో మధుమేహం సమస్య విపరీతంగా పెరిగిపోతోంది. భారతదేశంలో కూడా, మధుమేహం కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి జీవనశైలి మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మధుమేహం దీర్ఘకాలిక వ్యాధి. ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను తయారు చేయలేనప్పుడు లేదా శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించలేనప్పుడు డయాబెటిస్ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే స్వీట్లు తినడం వల్ల డయాబెటిస్ వస్తుందా? అనే ప్రశ్న మనందరిలో ఉత్పన్నమవుతోంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

READ MORE: KTR : కేటీఆర్‌కు షాకిచ్చిన ఏసీబీ.. ఆ తేదీన విచారణకు రావాలని నోటీసులు

అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం.. టైప్ 1 డయాబెటిస్ ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో రోగనిరోధక వ్యవస్థ.. ఇన్సూలిన్ ఉత్పత్తి చేసే కణాలపై దాడి చేస్తుందట. ఫలితంగా శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయి.. కణాలు చక్కెరను సరిగా వినియోగించుకోలేవని అంటున్నారు. ఈ క్రమంలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి డయాబెటిస్ బారిన పడతారని వెల్లడిస్తున్నారు. ఇక టైప్ 2 డయాబెటిస్ ఒకటి ఉంటుంది. ఈ వ్యాధి మాత్రం ఆహారపు అలవాట్లు, జీవన శైలికి సంబంధించిన అంశాలతో ముడిపడి ఉందట. ముఖ్యంగా చక్కెరలు అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే ఊబకాయం వచ్చి.. ఫలితంగా శరీరంలోని కీలక అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరిగుతుందట. రక్తంలో చక్కెర స్థాయులు పెరిగి షుగర్ వ్యాధికి దారి తీస్తుందని వివరిస్తున్నారు. చక్కెరలతో కూడిన స్వీట్లు, పానీయాలు అధికంగా తాగే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ముప్పు పెరుగుతుందని పలు అధ్యాయనాలు హెచ్చరిస్తున్నాయి.

READ MORE: India: మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుపై కుట్ర.. యూఎస్ రిపోర్ట్స్‌ని ఖండించిన భారత్..

Show comments