Mosquito Repellent Plants: ఇంట్లో ఈ మొక్కలు పెంచుకుంటే దోమల నివారణ తగ్గించవచ్చు..!
- వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువ
- నీరు చేరడం వల్ల దోమలు వృద్ధి
- మలేరియా.. డెంగ్యూ.. చికున్‌గున్యా వచ్చే ప్రమాదం
- ఇంటి చుట్టూ దోమలు చేరకుండా ఈ మొక్కలతో నిరోధించవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో నీరు చేరడం వల్ల దోమలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. దీని వల్ల మలేరియా, డెంగ్యూ మరియు చికున్‌గున్యా వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. అందువల్ల.. మీ ఇంటి చుట్టూ దోమలు చేరకుండా నిరోధించడం ఈ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. పరిశుభ్రతతో పాటు.. కొన్ని మొక్కల సహాయంతో దోమలను దూరంగా ఉంచవచ్చు. ఇంట్లో దోమల నివాణ తగ్గించేందుకు కొన్ని మొక్కలు పెంచుకుంటే.. వాటి వ్యాప్తి తగ్గుతుంది. ఆ మొక్కల సువాసన దోమలకు అస్సలు నచ్చదు. ఈ మస్కిటో రిపెల్లెంట్ ప్లాంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Read Also: CS Nirab Kumar Prasad: సీఎస్ పదవీ కాలం పొడిగింపు.. మరో 6 నెలలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Also Read
- Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే "పనీర్ భుర్జీ"తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
- Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్‌లోనే బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ చేయండి!
- Homemade Rose Water: లేడీస్ స్పెషల్.. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే రోజ్ వాటర్! గ్లోయింగ్ స్కిన్‌కు సింపుల్ సీక్రెట్ ఇదే..
- Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
రోజ్మేరీ
రోజ్మేరీని జుట్టు సంరక్షణ కోసం లేదా ఆహారంలో ఎక్కువగా ఉపయోగిస్తాము. కానీ ఆ మొక్క వాసన కారణంగా.. దోమలు ఎక్కువగా దరిచేరవు. ఈ మొక్కను ఇంట్లో పెంచడం కూడా చాలా సులభం. మీరు ఈ మొక్కను ఇంట్లో కంటైనర్ లేదా కుండలో సులభంగా పెంచుకోవచ్చు.
లావెండర్
లావెండర్ మొక్క ఎంతో సువాసనను వెదజల్లుతుంది. కానీ.. ఈ వాసన దోమలకు అస్సలు పడదు. దీంతో.. ఆ వాసనకు దోమలు ఉండవు. అందువల్ల.. ఈ మొక్కను మీ ఇంటి చుట్టూ లేదా కిటికీ దగ్గర నాటడం వల్ల మీ ఇంట్లోకి దోమలు రాకుండా ఉంచుతాయి. అంతేకాకుండా.. ఈ మొక్క సువాసన వ్లల బాగా నిద్ర పడుతుంది .
నిమ్మ గడ్డి
దోమలు పుల్లని వాసనలను ఇష్టపడవు. అందుకే లెమన్ గ్రాస్ ఉంటే దోమలు అస్సలు రావు. ఈ మొక్క కొద్దిగా నిమ్మకాయ వాసనతో ఉంటుంది. దీని కారణంగా.. కీటకాలు దూరంగా ఉంటాయి. మీరు మీ ఇంటి బయట ఈ మొక్కను నాటడం ద్వారా.. దోమలు సమీపంలో చేరవు.
బంతి పువ్వు
మేరిగోల్డ్ చాలా తేలికగా పెరిగే మొక్క. బంతి చెట్టుకు పూసే నారింజ, పసుపు పువ్వులు చాలా అందంగా కనిపిస్తాయి. అయితే ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల దోమలు రావు. దోమలు బంతి పువ్వుల వాసనను ఇష్టపడవు. వాటికి దూరంగా ఉండటానికి ఇష్టపడతాయి. అందువల్ల.. ఈ మొక్కలను మీ ఇంటి దగ్గర నాటడం వల్ల దోమల నివారణ తగ్గించుకోవచ్చు.
క్యాట్నిప్
క్యాట్నిప్ మొక్క ఎక్కడైనా సులభంగా పెరుగుతుంది. చాలా త్వరగా వ్యాపిస్తుంది. ఈ మొక్కలు పుదీనా జాతికి చెందినది. ఈ మొక్క సువాసన దోమలను దూరంగా ఉంచుతుంది. మొక్క సంరక్షణకు పెద్దగా శ్రమ పడదు. అందువల్ల, మీరు మీ ఇంటి చుట్టూ ఈ మొక్కలను సులభంగా నాటవచ్చు. ఈ మొక్క చాలా తేలికగా పెరుగుతాయి.
తాజావార్తలు
-
Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
-
Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
-
Kishan Reddy : జీవో 97పై బీజేపీ ఫైర్.. విద్యార్థులకు అండగా కిషన్ రెడ్డి.!
-
Mallikarjun Kharge: లోక్‌సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
-
TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!