Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!
- పేగు ఆరోగ్యం ఎందుకు అంత ముఖ్యమో తెలుసా?
- ప్రోబయోటిక్స్ vs ప్రిబయోటిక్స్: ఏవి ఎలా పనిచేస్తాయి?
- మంచి బ్యాక్టీరియాను పెంచే టాప్ ఆహారాలు
- గట్ హెల్త్ కోసం పాటించాల్సిన డైలీ హ్యాబిట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gut Health Tips: మన శరీరంలోని రోగనిరోధక శక్తిలో 70 శాతం పేగుల్లోనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పేగులు కేవలం ఆహారాన్ని జీర్ణం చేయడమే కాకుండా, శరీరంలో ‘రెండో మెదడు’లా పనిచేస్తాయి. జీర్ణక్రియ మెరుగుపడాలన్నా, అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలన్నా పేగుల్లో ఉండే ‘మంచి బ్యాక్టీరియా’ (గట్ మైక్రోబయోమ్) ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఇందుకోసం తీసుకోవాల్సిన ఆహారాల గురించి క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అదితి ప్రసాద్ ఆప్టే కొన్ని కీలక సూచనలు చేశారు.
1. ప్రోబయోటిక్ ఆహారాలు (Probiotics): ఇవి నేరుగా శరీరానికి లైవ్ బ్యాక్టీరియాను అందిస్తాయి. ఇవి జీర్ణ వ్యవస్థను శుభ్రంగా ఉంచి గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తాయి.
Also Read
- Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
- Arthritis Pain in Monsoon: వర్షాకాలంలో కీళ్ల నొప్పితో ఇబ్బందా..? నిపుణులు సూచించిన 5 చిట్కాలు మీ కోసం..
- Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ "పన్నీర్ టిక్కా"ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
- Kitchen Tips: వెల్లుల్లి తొక్క తీయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ ఈజీ టిఫ్‌తో సెకన్లలో పని పూర్తి!
పెరుగు, మజ్జిగ: ఇవి మనకు సులభంగా దొరికే అత్యుత్తమ ప్రోబయోటిక్స్.
పులియబెట్టిన పదార్థాలు: ఇడ్లీ, దోశ, గంజి వంటివి పేగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఇతరాలు: కెఫీర్, కిమ్చీ, సౌర్‌క్రాట్ (పులియబెట్టిన క్యాబేజీ), కీరదోస వంటి పులియబెట్టిన కూరగాయలు.
2. ప్రిబయోటిక్ ఆహారాలు (Prebiotics): మంచి బ్యాక్టీరియా పెరగడానికి కావాల్సిన ఆహారాన్నే ‘ప్రిబయోటిక్స్’ అంటారు.
కూరగాయలు: వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చి కూరగాయలు.
పండ్లు: అరటిపండు, ఆపిల్.
ధాన్యాలు: ఓట్స్, తృణధాన్యాలు.
3. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు (Fiber Rich Foods): పీచు పదార్థం పేగుల కదలికలను క్రమబద్ధీకరిస్తుంది.
బ్రకోలి: ఇందులోని సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం పేగు పొరను బలపరుస్తుంది.
ఇతరాలు: చిక్కుళ్లు, నట్స్, విత్తనాలు , తాజా పండ్లు.
ఆరోగ్యకరమైన గట్ కోసం మరికొన్ని చిట్కాలు:
నీరు: రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి.
బాగా నమలడం: ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల జీర్ణ ప్రక్రియ నోటిలోనే మొదలవుతుంది.
చక్కెర తగ్గించడం: స్వీట్లు, కూల్ డ్రింక్స్ చెడు బ్యాక్టీరియాను పెంచుతాయి, కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.
భోజన సమయం: పడుకోవడానికి 2-3 గంటల ముందే రాత్రి భోజనం ముగించాలి. భోజనం తర్వాత 15-20 నిమిషాల నడక జీర్ణక్రియకు ఎంతో మంచిది.
పులియబెట్టిన ఆహారాలు , పీచు కలిగిన ఆహారాల కలయిక మీ పేగు ఆరోగ్యాన్ని అద్భుతంగా మెరుగుపరుస్తుంది. సరైన జీవనశైలి , ఆహారపు అలవాట్లతో గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
Godavari Bathing Ghats : గోదావరి స్నాన ఘాట్ల దుస్థితి.. పవిత్రత మాయం.. అపరిశుభ్రతకు నిలయం.!
తాజావార్తలు
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!