NTV Telugu Site icon

White Hair To Black Hair: ఈ చిట్కాలు పాటిస్తే మీ తెల్లజుట్టు నల్లగా మారడం గ్యారంటీ

curry leaves paste

Collage Maker 16 Jan 2023 03.42 Pm

ఈరోజుల్లో మంచి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, అందాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. అందునా జుట్టు రాలిపోవడం, పొట్ట పెరిగిపోవడం మామూలైపోయింది. జుట్టు గురించి యువతీ, యువకులు ఎంతో జాగ్రత్త పడతారు. అయినా మన ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితుల కారణంగా జుట్టు రాలిపోవడం, చిన్నవయసులోనే జుట్టు తెల్లబడడం జరిగిపోతోంది. దీంతో యువత ఇబ్బంది పడుతున్నారు. బయటకు వెళితే వయసు పెద్దదిగా అనిపిస్తుంది. తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు ఎన్నో చిట్కాలు ఉపయోగిస్తారు. చాలామంది గోరింటాకు మిశ్రమం చాలా బాగా పనిచేస్తుందని చెబుతారు.

* గోరింటాకుల పొడిలో కాస్త పెరుగు, ధనియాలు, మెంతులు, కాఫీ పొడి, తులసి రసం, పుదీనా రసం వేసి బాగా కలపాలి. అలాగే ఈ మిశ్రమాన్ని ఒక పావుగంట పాటు ఉడికించాలి. రాత్రంతా కూడా దాన్ని అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం పూట ఈ మిశ్రమాన్ని మీ తలకు రాసుకుని, మూడు గంటల తరువాత తలస్నానం చేయాలి. ఇలా మీరు వారంలో రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం వుంటుంది. దీనివల్ల తెల్ల జుట్టు చాలా ఈజీగా నల్లగా మారుతుంది.

* ఉసిరికాయ ఇంకా అలాగే కొబ్బరినూనె మిశ్రమం కూడా దీనిపై బాగా పనిచేస్తుంది. మీరు ఉసిరికాయలలోని గింజలను తీసేసి ఎండబెట్టాలి. ఆ ఎండిన ఉసిరికాయలు కొన్నిటిని తీసుకుని పొడిగా చేసుకోవాలి. ఆ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దాన్ని పావు కప్పు కొబ్బరినూనెలో వేసి వేడి చేయాలి. వేడిచేసిన నూనెని రాత్రంతా కూడా అలాగే వదిలేయాలి. ఇక మరుసటి రోజు ఆ మిశ్రమాన్ని వడకట్టి ఆ తరువాత వచ్చే నూనెను సేకరించి మీ జుట్టుకు బాగా రాయాలి. ఇలా రాసిన తరువాత ఒక అర గంటపాటు ఉంచి శుభ్రంగా తలస్నానం చేయాలి. వారానికి మూడుసార్లు ఇలా చేయండి చాలు.. మీ జుట్టు నిగనిగలాడుతుంది. తెల్లజట్టు తగ్గుతుంది.

Read Also: Rice Research: కొత్తరకం సాంబమసూరి వరి వంగడం .. సాధారణం కన్నా అధిక దిగుబడి

* జుట్టును నల్లగా మార్చడంలో బ్లాక్ టీ బాగా పనిచేస్తుంది. పాలు కలపకుండా తయారు చేసిన బ్లాక్ టీ లో కాస్త ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా మీ తలకు బాగా పట్టించాలి.అది బాగా జుట్టు కుదుళ్లకు తగిలేలా రాయడం చాలా అవసరం. అర గంట పాటు అలాగే ఉంచి తలస్నానం చేయాలి.. ఇలా వారానికి రెండుమూడుసార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల ఇతర జుట్టు సమస్యలు కూడా రావు.

* వంటల్లో మనం రోజూ వాడే కరివేపాకు జుట్టుకు పోషణ ఇస్తుంది, వెంట్రుకలు రాలకుండా చేస్తుందంటే మీరు నమ్ముతారా? చుండ్రును నివారిస్తుంది అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు ఓ 10, 15 లేత కరివేపాకులను పచ్చిగానే తినడం అలవాటు చేసుకుంటే జుట్టు కుదుళ్లు గట్టి పరిచేందుకు కావలసిన పోషకాలు సమృద్ధిగా అందుతాయని సలహా ఇస్తున్నారు. కరీవేపాకును డైరెక్ట్ గా తినలేకపోతే మజ్జిగలో వేసి మిక్సీ చేస్తే మొత్తం కలిసి పోతుంది. అందులో చిటికెడు ఉప్పు, జీలకర్ర కూడా జోడిస్తే రుచిగానూ ఉంటుంది. ఆ జ్యూస్ తాగేస్తే మంచిది. ఆరోగ్యానికి ఆరోగ్యం, జుట్టు నల్లబడుతుంది.

* కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. కరివేపాకులో ఉండే బీటా కెరోటిన్, ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది. దీనిని పేస్ట్ లా చేసుకుని తలకు బాగా పట్టించడం వల్ల మెలనిన్ తయారీ బాగుంటుంది. మన జుట్టు నల్లగా ఉండడానికి ఈ రసాయనమే కారణం. కరివేపాకులో అమైనో యాసిడ్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది వెంట్రుకల కుదుళ్లను బలంగా ఉంచుతుంది. అర కప్పు కరివేపాకు, అర కప్పు మెంతి ఆకులను తీసుకొని దానికి కొద్దిగా నిమ్మరసం జోడించి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆపేస్ట్‌ని తీసుకుని తల అంతా రాసి అరగంట అలాగే ఉంచుకోవాలి. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఎటువంటి దుష్ప్రభావాలు లేని, తేలికైనా, చవక అయిన చిట్కా. వారానికి ఒకసారి ఈ చిట్కాలు పాటించడం మంచిది. చుండ్రు సమస్య ఉన్నవారికి ఇది మంచి ఉపాయం.

Read Also: Nagababu Sattires on Ambati Rambabu Dance Live: అంబటి రాంబాబు డ్యాన్స్ పై నాగబాబు సెటైర్లు

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.