మెడ, వెన్ను నొప్పి వస్తోందా? ఈ టిప్స్ పాటించండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరు ఏదో పనిలో బిజీగా ఉంటారు. అప్పుడు మెల్లగా మీ మెడ వెనక భాగంలో భుజాల దగ్గర ఏదైనా నొప్పి లాంటిది వస్తోందా? అదే తగ్గుతుందిలే అని దాన్ని లైట్ తీసుకోకండి. ఎందుకంటే… ఆ నొప్పి… అంతకంతకూ పెరుగుతుందే తప్ప వదలదు. చిరాకొచ్చి పని కూడా చెయ్యబుద్ధి కాదు. ఆ పని వదిలేస్తే తప్ప ఆ నొప్పి తగ్గదు. కానీ పని మానేయలేం కదా. కాబట్టి నొప్పిని భరిస్తూ… కొంత మంది పనిచేస్తూ ఉంటారు. అసలా నొప్పి ఎందుకు వస్తుందో తెలిస్తే… దాని అంతు చూడొచ్చు. అది తెలుసుకుందాం. మనం కూర్చునే ప్రదేశం, కూర్చునే విధానం సరిగ్గా ఉండకపోతే… ఈ మెడ, భుజాల నొప్పి మొదలవుతుంది. ఆరోగ్య నిపుణులు దీనికి మూడు మార్గాలు చెబుతున్నారు. పని మధ్యలో గ్యాప్ తీసుకోవాలి. బెడ్‌పైకి ల్యాప్‌టాప్ తీసుకెళ్లకూడదు. ఆరోగ్యకర ఆహారం తీసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటే… ఇలాంటి నొప్పులు ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. కానీ… కూర్చొనే ల్యాప్‌టాప్, సిస్టం లాంటి వాటిలో పని చేయాల్సి వస్తే మాత్రం… ఈ నొప్పి మొదలవుతుంది. ఇలాంటి చిన్న నొప్పులే భవిష్యత్తులో సెర్వికల్ పెయిన్, బ్యాకాచ్. ఆర్తరైటిస్ వంటి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. ముందు మీరు చెయ్యాల్సింది. మీ కీబోర్డు… మీ మోచేతుల కంటే కిందకు ఉండేలా చేసుకోవాలి. మీరు కూర్చునే విధానంలో మీ మోచేతుల కంటే… కీబోర్డు ఎత్తుగా ఉంటే… మరీ మీ కుర్చీ హైట్ పెంచుకొని కూర్చోవాలి. లేదా… కీబోర్డ్ ఎత్తు తగ్గించాలి. ఏం చేసైనా సరే… మోచేతులే ఎత్తుగా ఉండాలి. లేదంటే భుజం నొప్పి భరించాల్సి వస్తుంది. ఎన్ని పని ఒత్తిళ్లు ఉన్నా… రెగ్యులర్‌గా యోగా, ఎక్సర్‌సైజ్ వంటివి చేస్తూ ఉండాలి. ఇవి కండరాల్లో కదలికలు పెంచి… రక్త ప్రసరణ బాగా అయ్యేలా చేసి… అడ్డమైన నొప్పుల నుంచి కాపాడతాయి. రోజూ కనీసం గంటైనా ఫిజికల్ ఎక్సర్‌సైజ్ ఉండాలంటున్నారు.
Read Also : ఆడవారిలో అండాల నాణ్యత సంఖ్య తగ్గితే.. ?
Also Read
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
- Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే "మసాలా గుత్తివంకాయ" చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
ఇందుకోసం మెట్లు ఎక్కి దిగడం, గార్డెన్‌లో మొక్కల పని చెయ్యడం, ఇంట్లో బట్టలు ఉతుక్కోవడం, వంట చేసుకోవడం, బూజు దులుపుకోవడం, వాహనాల్ని క్లీన్ చేసుకోవడం, ఇంటీరియర్ డెకరేషన్, కుక్కకు స్నానం చేయించడం ఇలా ఎన్నో పనులను కావాలని కల్పించుకోవడం ద్వారా… బాడీలో కొవ్వు కరిగిపోయి… ఫిట్‌గా ఉంటారని చెబుతున్నారు. ల్యాప్ అంటే ఒడి. టాప్ అంటే ఒడిలో పెట్టుకొనేది అనే అర్థం కదా. కానీ… ల్యాప్‌టాప్‌ని ఒడిలో పెట్టుకొని మాత్రం పని చెయ్యకూడదు. అది బ్యాక్ పెయిన్ వచ్చేందుకు దారి తీస్తుంది. తప్పనిసరిగా ఓ టేబుల్, చైర్ ఉండాల్సిందే. టేబుల్ ముందు చైర్‌లో స్ట్రైట్‌గా, నిఠారుగా కూర్చోవాలి. ఏదో పోగొట్టుకున్నట్లుగా దిగాలుగా కూర్చోవద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఎక్కడ కూర్చున్నా… రెండు గంటలకోసారి లేచి… అలా ఓ రౌండ్ వేసి రమ్మంటున్నారు. తద్వారా కండరాలు కాస్త కదిలి… ఫ్రీ అవుతాయని చెబుతున్నారు. ఇక పని ఒత్తిడిలో ఆ కరకరలాడే స్నాక్స్ వంటివి ఎక్కువ తినొద్దని చెబుతున్నారు. అవి టెన్షన్ తగ్గించకపోగా… బరువు పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. వాటి పదులు పండ్లు, జ్యూస్, డ్రాఫ్రూట్స్, పప్పులు, గింజల వంటివి తినమని సూచిస్తున్నారు. ఎక్కువగా నీరు కూడా తాగాలంటున్నారు.
తాజావార్తలు
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!