Site icon NTV Telugu

Weight Loss Tips: బరువు తగ్గేందుకు ఐదు సూత్రాలు..

Weight Loss

Weight Loss

బరువు తగ్గడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా సులభమైన ఆహార ప్రణాళికలను కనుగొంటారు. ఈ ఐదు సూత్రాలు పాటించి బరువు ఈజీగా తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

READ MORE: Off the Record: ఆ ఎమ్మెల్యే పేరు చెప్పుకుని అంతా దోచేస్తున్నారా? ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు?

భోజనానికి 30నిమిషాల ముందు..
భోజనానికి అరగంట ముందు ఓ గ్లాసు నీరు తాగితే బరువు తగ్గుతారు. నీటిలో కేలరీలు ఉండవు. ఎక్కువగా తినడాన్ని తగ్గిస్తుంది. దీంతో పాటు.. రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇది మిమ్మల్ని హైడ్రేట్‌గా, రీఫ్రెష్‌గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది.

READ MORE: Kiccha Sudeep : అలా చేస్తే ఆయనపై గౌరవం పెరిగేది.. డిప్యూటీ సీఎంపై సుదీప్ కామెంట్స్

ప్రోటీన్స్ ఫుడ్స్ తినండి..
ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు స్పీడ్‌గా కరిగిపోతుంది. ఇవి ఆకలి హార్మోన్లని కంట్రోల్ చేస్తాయి. గుడ్డులోని తెల్లసొన, పాల ఉత్పత్తులు, చిక్కుళ్ళు, గింజలు, చికెన్, చేపల వంటి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్‌ని ఎక్కువగా తినాలి.

ప్రాసెస్డ్ ఫుడ్‌కి దూరంగా ఉండండి..
ప్రాసెస్డ్ చేసిన కార్బోహైడ్రేట్స్, కూల్ డ్రింక్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఫుడ్స్ తింటే బరువు ఈజీగా పెరుగుతారు. కాబట్టి, వీలైనంతవరకూ వీటికి దూరంగా ఉండాలి. చక్కెర బదులు తేనె, బెల్లం వాడితే మంచిది.

READ MORE: Off the Record: పార్టీ మారినా ఆ ఎంపీ తీరు మారలేదా..? ఎక్కడున్నా వివాదాలేనా..?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించే పదార్థాలు..
బరువు తగ్గడానికి పోషకాహారం తీసుకోవడం చాలా మంచిది. ఆహారంలో ఎక్కువ కూరగాయల్ని చేర్చితే ఎక్కువ పోషకాలు, తక్కువ కేలరీలు ఉంటాయి. అందులో భాగంగా బచ్చలికూర, క్యాబేజీ, గుమ్మడికాయ, బ్రోకలీ, పచ్చి బఠానీలు, పుట్టగొడుగులు, కాలీఫ్లవర్ వంటి తక్కువ కేలరీల కూరగాయల్ని ఎక్కువగా తీసుకోవాలి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పదార్థాలను కరిగించి బరువు తగ్గేలా చేస్తాయి.

వ్యాయామం తప్పని సరి..
బరువు తగ్గడంలో ఆహారం ఎంత ముఖ్యమో వర్కౌట్ కూడా అంతే ముఖ్యం. శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గాలంటే వర్కౌట్ తప్పనిసరి. ప్రతిరోజూ కేవలం 30 నిమిషాల వాకింగ్, సైక్లింగ్ చేయడం వల్ల బరువు తగ్గుతారు. దీంతో హైబీపి, మధుమేహం, గుండెజబ్బులని తగ్గించుకోవచ్చు.

Exit mobile version