Fenugreek Water: మెంతి నీటితో బరువు తగ్గుతారా..! ఎలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fenugreek Water: మెంతి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందించడమే కాకుండా సాంప్రదాయ వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. మెంతి భారతీయ వంటకాలలో ఉపయోగిస్తారు. జీర్ణక్రియకు సహాయపడటానికి, మంటను తగ్గించడానికి, వివిధ వ్యాధుల చికిత్సకు సహాయం చేస్తుంది మెంతి. బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. మెంతిలో అధిక ఫైబర్ కంటెంట్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. మెంతిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జీవక్రియను పెంచడంలో, కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయపడే సమ్మేళనాలను కలిగి ఉంటుంది.
మెంతికూరను రకరకాలుగా తినవచ్చు. దీనిని క్యాప్సూల్ లేదా పౌడర్ రూపంలో సప్లిమెంట్‌గా తీసుకోవచ్చు. కూరలు, సూప్‌లు, పప్పు, వెజిటబుల్ స్టైర్ ఫ్రై వంటి ఆహారాలకు జోడించవచ్చు. మెంతులను వేడి నీటిలో మరిగించి టీగా తీసుకోవచ్చు. ఆహారంలో మెంతిని చేర్చుకోవడం అనేది ఆరోగ్యకరమైన, సహజంగా బరువు తగ్గడంలో సహాయపడే ప్రభావవంతమైన మార్గం. మెంతి నీటిని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మెంతి వాటర్ లో కొవ్వును తగ్గించే లక్షణాలను ఎక్కువగా ఉంటాయి. ఈ పానీయం తయారు చేయడం సులభం, టీ లేదా కాఫీకి ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. మీకు కావలసిందల్లా మెంతి గింజలు, నీరు.
Also Read
- Calcium-Rich Foods: పాల కంటే 8 రెట్లు ఎక్కువ కాల్షియం.. రోజుకు కొంచెం తిన్నా ఎముకలు ఉక్కులా మారతాయి!
- Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే 'మసాలా పన్నీర్ పరాటా' ఇలా చేసుకోండి..!
- Child Stomach pain: స్కూల్‌కు వెళ్లే ముందు పిల్లలు కడుపునొప్పి అంటున్నారా..? అసలు కారణం ఇదే కావచ్చు!
- Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే 'వెజిటబుల్ బిర్యానీ' ఇలా చేసేయండి..!
Read also: CV Anand: ప్రస్తుతం సమాజంలో సెల్ ఫోన్లు చాలా కీలకంగా మారాయి
ఎలా తయారు చేయాలి?
మెంతి వాటర్ సిద్ధం చేయడానికి, ముందుగా మెంతి గింజలను రాత్రిపూట నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం, నీటిని వడకట్టి విత్తనాలను తీసేయాలి. ఒక బాణలిలో వడకట్టిన నీటిని వేసి మరిగించాలి. అలా పదినిమిషాలు చేయాలి. అప్పుడు మీకు నచ్చిన స్వీటెనర్ కాస్త వేసుకోవాలి. మెంతి పానీయం వేడిగా లేదా చల్లగా తాగవచ్చు. రుచిని మెరుగుపరచడానికి నిమ్మకాయ రసం జోడించవచ్చు. మెంతులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెంతి నీరు ఊబకాయాన్ని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
అయితే కొంత మందికి ఈ మెంతి నీరు పడకపోవచ్చు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు, ఫుడ్ ఎలర్జీలు ఉన్నవారు మెంతి నీరు తాగితే ప్రయోజనాల కంటే దుష్ప్రభావాలే ఎక్కువ. కొందరికి మెంతి నీళ్ళు తాగితే అజీర్తి సమస్య వస్తుంది. అలాంటి వారి పేగుల్లో ఉండే బ్యాక్టీరియా గ్యాస్‌ను తయారు చేయడం ప్రారంభిస్తుంది. దానివల్ల ఈ సమస్య వస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం, గర్భిణీ స్త్రీలు మెంతి నీటిని తాగకూడదు. కొంతమంది స్త్రీలలో ఇది గర్భస్రావం కలిగిస్తుంది. కాబట్టి గర్భిణీలు వైద్యుని సలహా మేరకే మెంతులను ఆహారంలో తీసుకోండి. మెంతులు మీ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. అయితే మీరు ఇప్పటికే డయాబెటిస్‌కు మందులు తీసుకుంటుంటే మెంతులు తీసుకోవడం మానేయడం మంచిది. ఎందుకంటే గ్లూకోజ్ స్థాయి పరిమితికి మించి తగ్గిపోవచ్చు. ఇది కూడా సమస్యే.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 13 LIVE: కమనీయం.. రమణీయం.. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం..!
-
Constitution Day: కాంగ్రెస్‌కు రాబోయే ఎన్నికల్లోనూ ఓటమి తప్పదు: అనురాగ్ ఠాకూర్
-
Parliament Special Session 2026: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై ఉత్కంఠ
-
December Rule Changes: డిసెంబర్ 1 నుంచి మారబోతున్న రూల్స్ ఇవే.. ఎస్బీఐ కార్డుల బాదుడు నుంచి ఆధార్ ఫ్రీ అప్డేట్ వరకు!
-
Supreme Court: మొబైల్ ఫోన్, మైక్ పట్టుకున్న ప్రతీ ఒక్కరూ జర్నలిస్ట్ కాదు.. సుప్రీంకోర్టులో కీలక విచారణ!
-
JC Prabhakar Reddy: నాకు రాజకీయ ప్రతిష్ఠ ముఖ్యం కాదు.. పల్లెల్లో మార్పే నా లక్ష్యం..
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!