Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
- ఎండ నుంచి వచ్చిన వెంటనే ఐస్ వాటర్ తాగడం ప్రమాదం..
- ఇలాంటి టిప్స్ పాటించాలని వైద్య నిపుణులు సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Summer Tips: వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువ ఎండలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఎండల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే కూల్ వాటర్ తాగుతుంటారు. చల్లని నీరు తాగగానే చాలా రిలీఫ్ వచ్చినట్లు అనిపించినా, ఇది చాలా ప్రమాదమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మన శరీరం ఉష్ణోగ్రతలకు అనుగుణంగా మార్పులు చేసుకుంటుంది. ఎండల తీవ్ర ఎక్కువగా ఉంటే చెమటలు పట్టడం, రక్త నాళాలు వ్యాకోచించడం జరుగుతుంది. శరీరంలోని ద్రవాలు చెమట రూపంలో వేగంగా బయటకు వెళ్తుంటాయి. ఇది బాడీ టెంపరేచర్‌ను తగ్గించే సహజ ప్రక్రియ. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా కూల్ వాటర్ తాగితే శరీరం ఒక్కసారిగా ‘‘టెంపరేచర్ షాక్’’కు గురవుతుంది.
Also Read
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
- Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
ఈ సమస్యలు రావచ్చు:
కూల్ వాటర్ తాగడం వల్ల జీర్ణక్రియ తాత్కాలికంగా దెబ్బతినొచ్చు. కొందరికి కడుపులో ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు. ఎండలో శరీరం డీహైడ్రేట్ అయిన తర్వాత ఐస్ వాటర్ తాగితే గొంతు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారిగా చల్లని నీరు తాగితే నరాలపై ప్రభావం పడి తలనొప్పి రావొచ్చు. తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. సాధారణ ఉష్ణోగ్రతలో నీటిని శరీరం వేగంగా గ్రహిస్తుంది. కూల్ వాటర్ మాత్రం త్వరగా శరీరానికి చేదు.
ఎవరు జాగ్రత్త వహించాలి?
ముఖ్యంగా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్న వారు ఇలాంటి పరిస్థితుల్లో కూల్ వాటర్‌ను తీసుకోకపోవడమే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మైగ్రేన్, సైనస్, కడుపు నొప్పి, ఎండలో ఎక్కువగా వ్యాయామం చేసేవారు ఎండ నుంచి వచ్చిన వెంటనే చల్లటి నీరును తీసుకోకపోవడమే మంచిది.
కూల్ వాటర్ బదులు వీటిని తీసుకోండి.
ఎండ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కూల్ వాటర్‌కు బదులుగా సాధారణ ఉష్ణోగ్రత లేదా కాస్త చల్లగా ఉన్న నీటిని తీసుకోవడం బెటర్. కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్ఎస్ ద్రావణాలు శరీరం మెరుగుపడేందుకు సహకరిస్తాయి.
ఎండ నుంచి వచ్చిన వెంటనే ఏం చేయాలి.?
ఎండ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే 5-10 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. ముఖం, చేతులను సాధారణ నీటితో కడుక్కోవాలి. నీటిని నెమ్మదిగా తాగాలి. కూల్ డ్రింక్స్ తాగొద్దు. రోజు మొత్తం తరుచుగా నీటిని తాగుతూనే ఉండాలి.
తాజావార్తలు
-
Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
-
Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..