Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Helmet and Hair Loss: రోడ్డు ప్రమాదాల నుంచి ప్రాణాలను కాపాడటంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుంది. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం చట్టపరంగా కూడా తప్పనిసరి. అయితే, ప్రతిరోజూ హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలిపోతుందనే భయం చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా యువత తమ బట్టతలకు హెల్మెట్నే కారణమని భావిస్తుంటారు. కానీ వైద్య నిపుణులు మాత్రం ఇది పూర్తిగా అపోహ మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. చర్మవ్యాధి నిపుణుల ప్రకారం, హెల్మెట్ నేరుగా జుట్టు రాలడానికి లేదా బట్టతలకు కారణం కాదు. జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు జన్యుపరమైనవి, హార్మోన్ల మార్పులు మరియు జీవనశైలి సంబంధిత అంశాలేనని వారు చెబుతున్నారు.
పరిశోధనలు ఏమంటున్నాయి?
అంతర్జాతీయ వైద్య పరిశోధనల ప్రకారం కూడా హెల్మెట్ ధరించడం వల్ల శాశ్వతంగా జుట్టు రాలిపోదు. పురుషుల్లో కనిపించే మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ లేదా ఆండ్రోజెనిక్ అలోపేసియా పూర్తిగా జన్యుపరమైన, హార్మోన్ల సమస్య అని నిపుణులు చెబుతున్నారు. హెల్త్‌లైన్ వంటి వైద్య వెబ్సైట్లు కూడా హెల్మెట్ వల్ల వెంట్రుకల కుదుళ్ల DNAలో మార్పులు రావని పేర్కొంటున్నాయి. అయితే హెల్మెట్‌ను సరిగా ఉపయోగించకపోతే, పరిశుభ్రత పాటించకపోతే మాత్రం జుట్టు బలహీనపడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నాయి.
Also Read
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
హార్మోన్ల మార్పులే ప్రధాన కారణం
“హెల్మెట్ వల్ల జుట్టు రాలదు. హార్మోన్ల మార్పులు, థైరాయిడ్ సమస్యలు, మహిళల్లో PCOD వంటి కారణాల వల్లే ఎక్కువగా జుట్టు రాలుతుంది” అంటున్నారు వైద్య నిపుణులు.. మహిళలు బిగుతైన పోనీటెయిల్స్తో హెల్మెట్ ధరించడం వల్ల రాపిడి ఏర్పడి వెంట్రుకలు విరిగే అవకాశం ఉంటుందని కూడా వివరించారు.
బిగుతైన హెల్మెట్ ప్రమాదకరం
చర్మవ్యాధి నిపుణుల ప్రకారం, చాలా బిగుతుగా ఉండే హెల్మెట్ ధరించడం వల్ల వెంట్రుకల కుదుళ్లపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల “ట్రాక్షన్ అలోపేసియా” అనే సమస్య వచ్చే ప్రమాదం ఉందని ఆమె చెప్పారు. అలాగే, హెల్మెట్‌ను తరచుగా శుభ్రం చేయకపోతే చెమట, దుమ్ము పేరుకుని తలపై బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి చుండ్రు, దురద, జుట్టు రాలడం వంటి సమస్యలకు దారితీస్తాయి.
జుట్టును రక్షించుకోవడానికి పాటించాల్సిన చిట్కాలు
* హెల్మెట్ ధరించేటప్పుడు సరైన సైజులో ఉండే హెల్మెట్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మరీ బిగుతుగా లేదా మరీ వదులుగా ఉండకూడదు.
* హెల్మెట్ ధరించే ముందు తలపై శుభ్రమైన కాటన్ గుడ్డ లేదా స్కార్ఫ్ కట్టుకోవడం మంచిది. ఇది చెమటను పీల్చుకుని జుట్టును రక్షిస్తుంది. అలాగే వారానికి కనీసం ఒకసారి హెల్మెట్ లోపలి భాగాన్ని శుభ్రం చేయాలి.
* తడి జుట్టుతో హెల్మెట్ ధరించడం మానుకోవాలి. తడి జుట్టు బలహీనంగా ఉండటంతో రాపిడి కారణంగా త్వరగా విరిగిపోతుంది.
హెల్మెట్‌పై భయపడాల్సిన అవసరం లేదు
మొత్తానికి, హెల్మెట్ ధరించడం వల్ల నేరుగా బట్టతల రాదు. సరైన పరిశుభ్రత, సరైన హెల్మెట్ ఎంపిక, జుట్టు సంరక్షణ పాటిస్తే ఎలాంటి సమస్యలు రావని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి భద్రత కోసం హెల్మెట్ తప్పనిసరిగా ధరించడంతో పాటు, జుట్టు ఆరోగ్యంపైనా సరైన శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు..
తాజావార్తలు
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!