Health tips: ప్రతిసారి తలనొప్పికి మాత్ర వేసుకుంటున్నారా..ఈ ఆయిల్స్ ట్రై చేయండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తలనొప్పి సమస్య.. చాలా చిన్నదే అయినా..ఆ బాద భరించే వాళ్లకే తెలుస్తుంది. కంటికి కనిపించని జబ్బుతో లోపల యుద్దం చేసినట్లే.. పక్కన వాళ్లకు ఏం అర్థంకాదు.. ఏ జ్వరమో.. జలుబో అయితే కనిపిస్తుంది.. కానీ తలనొప్పి ఏం కనిపించదు కాదా.. తలపట్టేసుకుని మనమే బాధపడుతూ ఉండాలి. దీని వల్ల మనిషి చాలా డిస్ట్రబ్ అవుతాడు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. మూడ్ అంతా మారిపోతుంది.
తలనొప్పి వచ్చిందంటే చాలు టాబ్ లెట్ వేసుకుంటే కానీ తగ్గదు కొన్నిసార్లు. కానీ తరచూ తలనొప్పి వస్తుంటే మీరు ప్రతిసారి టాబ్ లెట్ వేసుకోవటం మంచిదికాదు. అసలు ఎందుకు వస్తుంది కారణం ఏంటో తెలుసుకోవాలిగా..తలనొప్పికి ఎక్కువగా ఉండేకారణాలు..ఒత్తిడి, నిద్రలేమి, అతిగా ఆలోచించటం. వీటిల్లో ఏదోఒక దానివల్లే మీకు తలనొప్పి వస్తుంటుంది. ఇవి కాకుండా కూడా కొన్ని రీజన్స్ ఉంటాయిలేండి. అయితే తలనొప్పికి సహజసిద్దమైన పరిష్కారం ఉంది. కొన్ని రకాలు పరిమళమైన ఆయిల్స్ తో తలనొప్పిని మాయం చేసేయొచ్చట. అవేంటో ఇప్పుడు చూద్దాం.!
Also Read
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
పెప్పర్మెంట్ నూనె
పెప్పర్మెంట్ నూనె తలనొప్పి, కండరాల నొప్పి, దురద, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. కెమోమిలా నూనె నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. ఇలా తలనొప్పి, ఒత్తిడి, ఆందోళన తగ్గటానికీ దోహదం చేస్తుంది. యూకలిప్టస్ నూనె పుండ్లు నయం కావటానికి, రక్తంలో గ్లూకోజు నియంత్రణలో ఉండటానికి, నంజుపొక్కులు తగ్గటానికి ఈ నూనె బాగా ఉపయోగపడుతుంది.
లావెండర్ నూనె దిగులు, ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది. ఇది పార్శ్వనొప్పి నుంచీ ఉపశమనం కలిగిస్తుంది. మనసుకు ప్రశాంతను ఇస్తుంది. డిస్టర్బ్ గా ఉన్నవాళ్ల మైండ్ కూడా లావెండర్ నూనె వాసనకు సెట్ అయిపోతుందట. స్టీమ్ డిస్టిలేషన్ ప్రాసెస్ లో రెడీ అయ్యే లావెండర్ నూనెకు చాలా ప్రత్యకతలు ఉన్నాయి. శరీరం రిలాక్స్ అయ్యేలా చేయడం మాత్రమే కాదు… నీరసం కూడా దూరం చేస్తుందట. దాంతో పాటు చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే.. గాఢంగా ఉండే పరిమళ నూనెలను నేరుగా చర్మానికి రాసుకోకూడదు. ఇతర నూనెల్లో కలిపి రాసుకోవాలి. టిష్యూ కాగితం మీద రెండు మూడు చుక్కలు వేసి వాసన పీల్చుకోవచ్చు. రూమ్ ఫ్రెష్నర్లోనూ కొన్ని చుక్కలు కలుపుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన ఫ్లేవర్ ఉన్న ఆయల్ ను ఎంచుకుని తలనొప్పికి ట్రై చేయండి. కెమికల్సతో కూడిన టాబ్ లెట్ ప్రతిసారి వాడటం కంటే ఈ ఆయిల్స్ ను అప్పుడప్పుడు ట్రై చేయటం మంచిదే కదా..!
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!