Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్యాన్సర్ అనగానే చాలా మంది దానికి తీసుకునే కష్టమైన చికిత్సల గురించే ఆలోచిస్తారు. సాధారణంగా వైద్యులు క్యాన్సర్ వచ్చాక దానిని నియంత్రించడం పైనే దృష్టి పెడతారు. కానీ అది రాకముందే గుర్తిస్తే ఎలా ఉంటుంది? ఇక్కడే క్యాన్సర్ జెనెటిక్స్ ప్రాధాన్యత కనిపిస్తుంది. జన్యు పరీక్షలు చేయించుకుంటే కచ్చితంగా ముందస్తు సర్జరీలు చేసుకోవాలనే అపోహ జనాల్లో ఉంది. గత పదేళ్లలో ఈ రంగం చాలా అభివృద్ధి చెందింది, సర్జరీ ఒక్కటే దీనికి మార్గం కాదు.
చాలావరకు క్యాన్సర్లు సాధారణంగానే వస్తాయి, కానీ 5 నుండి 10 శాతం క్యాన్సర్లు ఒక తరం నుండి మరో తరానికి జన్యువుల ద్వారా సంక్రమిస్తాయి. ఇవి క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. సింగపూర్‌లో జరిగిన ఒక పరిశోధన ప్రకారం.. జన్యు పరీక్షలు అవసరమైన వారిలో కేవలం 17 శాతం మందికి మాత్రమే పరీక్షలు జరుగుతున్నాయి, మిగిలిన 80 శాతానికి పైగా మంది ఈ అవకాశాన్ని కోల్పోతున్నారు. దీనివల్ల ముందస్తు నివారణ కష్టమవుతోంది.
Also Read
- Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
- Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
క్యాన్సర్ ముప్పును గుర్తించడానికి కుటుంబ చరిత్ర చాలా కీలకమైన ఆధారం. ఒకే కుటుంబంలో ఎక్కువ మందికి క్యాన్సర్ రావడం, చిన్న వయసులోనే రావడం లేదా ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ క్యాన్సర్లు రావడం వంటివి జన్యుపరమైన సమస్యలకు సంకేతాలు కావచ్చు. రొమ్ము, అండాశయం, ప్రేగు మరియు గర్భాశయ క్యాన్సర్లు ఇలా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
జన్యు పరీక్షల ద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నవారిని ముందుగానే గుర్తించి, వారికి తగిన స్క్రీనింగ్ పద్ధతులు లేదా ముందస్తు జాగ్రత్తలు సూచించవచ్చు. దీనివల్ల క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి నయం చేయడం సులువవుతుంది. ఒక వ్యక్తిలో ఈ లోపాన్ని గుర్తిస్తే, వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు లేదా పిల్లలకు కూడా ఆ ముప్పు ఉండే అవకాశం 50 శాతం ఉంటుంది కాబట్టి, ఒకరి పరీక్ష ద్వారా కుటుంబం మొత్తాన్ని కాపాడుకోవచ్చు.
ఈ పరీక్షలు కేవలం ప్రమాదాన్ని అంచనా వేయడానికే కాకుండా, ఒకవేళ క్యాన్సర్ వస్తే దానికి ఎలాంటి మందులు లేదా థెరపీలు బాగా పనిచేస్తాయో తెలుసుకోవడానికి కూడా వైద్యులకు ఉపయోగపడతాయి. అయితే, ఇవి కేవలం వచ్చే అవకాశం ఉందో లేదో మాత్రమే చెబుతాయి కాబట్టి సాధారణ హెల్త్ చెకప్స్‌లో వీటిని చేర్చరు. అనవసర ఆందోళన పడకుండా, మొదట మీ కుటుంబ ఆరోగ్య చరిత్రను తెలుసుకుని, అవసరమైతేనే వైద్యుడి సలహాతో ఈ పరీక్షలు చేయించుకోవడం మంచిది.
తాజావార్తలు
-
Imam ul Haq Ban: గాయం అంటూ నాటకాలు.. పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌పై రెండేళ్ల నిషేధం!
-
Irumudi Nizam : నైజాంలో ‘ఇరుముడి’ విధ్వంసం.. 13రోజుల్లో రూ. 75 కోట్ల గ్రాస్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
Abhinandan Varthaman: పాక్ F-16ను కూల్చిన వీరుడు.. IAFకు గుడ్‌బై చెప్పిన అభినందన్! గోవాలో కొత్త ఇన్నింగ్స్..
ట్రెండింగ్
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!