NTV Telugu Site icon

Palm Oil: పామ్ ఆయిల్ వాడుతున్నారా..? ఈ విషయం తెలిస్తే అస్సలు వాడరు

Palm Oil

Palm Oil

భారతదేశంలో అనేక రకాల నూనెలను వంటలకు ఉపయోగిస్తారు. అందుకోసం.. వేరుశెనగ నూనె, పొద్దుతిరుగుడు నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, నువ్వుల నూనె, ఆలివ్ నూనె, ఆవాల నూనె మొదలైన అనేక రకాల నూనెలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరూ తమకు నచ్చినంత కూరల్లో గానీ, వివిధ రకాల వంటకాల్లో వేసుకుని వాడుతుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని రకాల నూనెలను వంటలో ఉపయోగించకూడదని అంటున్నారు. ఇందులో పామాయిల్ కూడా ఉంది. దీనిని ఉపయోగిస్తే గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు. ఇతర నూనెల ధరలతో పోలిస్తే పామాయిల్ ధర చాలా తక్కువ. అందువల్ల పామాయిల్‌ను ఎక్కువగా వాడుతుంటారు. చాలా అధ్యయనాలు హానికరమైన దుష్ప్రభావాలను కలిగి ఉన్నాయని చెబుతున్నాయి. పరిశోధనల ప్రకారం.. ఈ నూనెను ఎక్కువగా ఉపయోగించేవారిలో గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతోంది.

Delhi: ట్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు.. నిందితుడి మొబైల్‌లో ఏమున్నాయంటే..!

గుండె మీద ఒత్తిడి:
పామాయిల్‌లో అధిక మొత్తంలో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది.. దీని వల్ల శరీరంలో కరగదు. ఈ కొవ్వు కణాలు గుండె నుండి రక్తాన్ని సరఫరా చేసే ధమనులను పోగుచేసి అడ్డుకుంటాయి. దీని కారణంగా రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల గుండెపై ఒత్తిడి ఏర్పడుతుంది. దీంతో.. గుండెపోటు, స్ట్రోక్ మొదలైన వాటి ప్రమాదాలు వస్తాయి.

బరువు పెరగడం:
పామాయిల్ తీసుకోవడం వల్ల శరీరంలో తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (ఎల్‌డిఎల్), చెడు కొవ్వు స్థాయి పెరుగుతుంది. LDL స్థాయిలు పెరిగేకొద్దీ, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతే కాకుండా.. అధిక రక్తపోటు కూడా సంభవించవచ్చు. పామాయిల్‌తో చేసిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల బరువు పెరగడం, మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది.

పామాయిల్‌ను శుద్ధి చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. రిఫైన్డ్, డబుల్ రిఫైన్డ్ ఆయిల్ తయారు చేసేటప్పుడు 6 నుండి 13 రకాల రసాయనాలను ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల నూనెలోని సహజ గుణాలైన ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు నశిస్తాయి. దీని కారణంగా నూనె పూర్తిగా చెడుగా మారుతుంది. ఇలాంటి రిఫైన్డ్ ఆయిల్స్ వాడేవారిలో హార్ట్ బ్లాక్స్, హార్ట్ డిసీజ్ సంభవం పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Show comments