Refrigerator Tips : మీ రిఫ్రిజిరేటర్ పైన ఎప్పుడూ ఉంచకూడని 7 వస్తువులు ఇవే..!
- ఫ్రిజ్‌పై వస్తువులు పెట్టడం ఎందుకు ప్రమాదం?
- నూనెలు, మందులు త్వరగా పాడయ్యే కారణం
- రసాయనాలు, కాగితాలతో అగ్నిప్రమాద ముప్పు
- ఫ్రిజ్ పనితీరుపై పరిశోధనలు చెప్పిన నిజాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Refrigerator Tips : మన వంటగదిలో వస్తువులు దాచుకోవడానికి ఎన్ని అరలు ఉన్నా, చేతికి అందుబాటులో ఉంటుందని చాలామంది ప్రతి చిన్న వస్తువునూ ఫ్రిజ్ పైభాగంలోనే పెట్టేస్తుంటారు. పండ్లు, కిరాణా సరుకులు, నూనె డబ్బాలు, మందుల దాకా అన్నీ అక్కడ పేర్చడం సాధారణ అలవాటుగా మారిపోయింది. అయితే, ఈ చిన్న అలవాటు మీ ఫ్రిజ్ జీవితకాలాన్ని తగ్గించడమే కాకుండా తీవ్రమైన ఆరోగ్య, అగ్ని ప్రమాదాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రిజ్ తన లోపలి భాగాలను చల్లగా ఉంచేందుకు నిరంతరం వేడిని బయటకు విడుదల చేస్తూ ఉంటుంది. మనం ఫ్రిజ్ పైన ఎక్కువ వస్తువులు పెట్టడం వల్ల ఆ వేడి సరిగ్గా బయటకు పోక కంప్రెసర్‌పై విపరీతమైన భారం పడుతుంది. దీనివల్ల కరెంట్ బిల్లు పెరగడమే కాక, ఫ్రిజ్ త్వరగా పాడైపోతుంది.
ఆహార పదార్థాలు, మందులకు జరిగే నష్టం
ఆలివ్ ఆయిల్, పొద్దుతిరుగుడు, కుసుమ నూనె వంటి వంట నూనెలను ఎల్లప్పుడూ చల్లని ప్రదేశంలో ఉంచాలి. ఫ్రిజ్ పైనుంచి వచ్చే నిరంతర వేడి వల్ల నూనెల్లో ఆక్సీకరణ ప్రక్రియ వేగవంతమై, వాటి రుచి, సువాసన , నాణ్యత పూర్తిగా దెబ్బతింటాయి. అదేవిధంగా ఫ్రిజ్ పైభాగంలో ఉండే వెచ్చని గాలి వల్ల బ్రెడ్ త్వరగా పొడిబారుతుంది. కవర్లలో ఉంచితే తేమ చేరి వేగంగా బూజు పడుతుంది. కేకులు, పేస్ట్రీలు కూడా తమ మెత్తదనాన్ని కోల్పోతాయి. ఇక మందుల విషయానికొస్తే, వీటిని ఎల్లప్పుడూ సాధారణ ఉష్ణోగ్రత వద్ద, తేమ లేని ప్రదేశంలో ఉంచాలి. ఫ్రిజ్ వేడికి నిరంతరం గురికావడం వల్ల ఆ మందుల ప్రభావం తగ్గిపోయి నిష్ప్రయోజనంగా మారతాయి.
Also Read
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
- Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
- Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
పెరిగే అగ్నిప్రమాదాలు, రసాయనాల ముప్పు
ఫినాయిల్స్, యాసిడ్స్, బ్లీచింగ్ ప్రొడక్ట్స్ వంటి శుభ్రపరిచే రసాయనాలను పొరపాటున కూడా ఫ్రిజ్ పైన పెట్టకూడదు. వేడి వల్ల ఆ బాటిళ్లలో ప్రెజర్ పెరిగి పగిలిపోయే లేదా లీక్ అయ్యే ప్రమాదం ఉంది. నాణ్యత లేని ప్లాస్టిక్ డబ్బాలు నిరంతర వేడికి కరిగిపోవడమే కాకుండా, వాటి నుంచి హానికర రసాయనాలు విడుదలవుతాయి. వాటిల్లో ఆహారం ఉంచితే అది విషపూరితంగా మారే అవకాశం ఉంది. వీటితో పాటు టిష్యూ పేపర్లు, వార్తాపత్రికలు, అగ్గిపెట్టెలు లేదా కొవ్వొత్తులను ఫ్రిజ్ పైన ఉంచడం అత్యంత ప్రమాదకరం. కంప్రెసర్ తీవ్రంగా వేడెక్కినప్పుడు వీటికి సులభంగా మంటలంటుకుని అగ్నిప్రమాదాలు జరిగే అవకాశముంది. ఇక కుండీల్లోని మొక్కలు ఫ్రిజ్ పైన ఉంచడం వల్ల ఆ వేడికి మట్టి త్వరగా ఎండిపోయి వేర్లు దెబ్బతిని వాడిపోతాయి.
పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
‘సస్టైనబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ అండ్ అసెస్మెంట్స్’ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, ఫ్రిజ్ చుట్టూ గాలి ధారాళంగా ప్రసరించినప్పుడే అది సమర్థవంతంగా పనిచేస్తుంది. ఫ్రిజ్ పైభాగంలో లేదా పక్కల అడ్డంకులు ఉంచడం వల్ల ఉష్ణ ప్రసారానికి విఘాతం కలిగి, ఫ్రిజ్ సాధారణం కంటే ఎక్కువ విద్యుత్‌ను వినియోగించుకుంటుంది. ఫ్రిజ్ పైభాగం అనేది వస్తువులు దాచుకునే అర కాదు. దానిని ఎల్లప్పుడూ ఖాళీగా ఉంచడం వల్ల విద్యుత్ బిల్లు తగ్గడమే కాకుండా, మీ కుటుంబ భద్రతకు కూడా మంచిది. వంటగదిలో స్థలం తక్కువగా ఉంటే వాల్ షెల్ఫ్‌లు లేదా సపరేట్ స్టాండ్లను ఉపయోగించడం శ్రేయస్కరం.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!+
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!