Health Tips: ‘అల్లం’తో అనేక ప్రయోజనాలు.. అవేంటంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశంలో అల్లం అంటే తెలియనివారు ఉండరు. దీని ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం కూడా లేదు. వంటల్లో వాడే అల్లంను సూపర్ ఫుడ్ అంటారు. అయితే దీన్ని తినడం వల్ల సౌందర్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని బ్యూటీషియన్స్ చెబుతున్నారు. చర్మం, జుట్టు సంరక్షణలో అల్లం కీలక పాత్ర పోషిస్తుంది. శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల కారణంగా ఇది స్కిన్, హెయిర్ కేర్ ప్రొడక్ట్‌గా కూడా ఉపయోగపడుతుంది. జుట్టు పెరుగుదలను వృద్ధి చేస్తూ, చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించే అల్లం ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. మెరిసే చర్మం:
Also Read
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
ఈ సూపర్‌ఫుడ్‌లో జింజెరాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఆక్సిడేషన్ స్ట్రెస్‌తో పోరాడుతుంది. ఇది స్కిన్ టోన్‌ను మెరుగుపరిచి చర్మం మెరిసేలా చేస్తుంది. అల్లం ముక్కలను చూర్ణంలా చేసి ముఖానికి అప్లై చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇది ముఖ చర్మాన్ని శుభ్రపరచడంతో పాటు మచ్చలతో పోరాడుతుంది. ఇలా చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా మారుస్తుంది.
2. ముడతలు, ఫైన్ లైన్స్‌కు చెక్:
అల్లం యాంటీఆక్సిడెంట్స్‌కు నిలయం. ఇది ముడతలను నివారిస్తుంది. అల్లం ఎలాస్టిన్ రెసిస్టెన్స్‌ను అడ్డుకుంటూ.. ముడతలు, ఫైన్ లైన్స్‌కు చెక్ పెడుతుంది. ఇలాంటి స్కిన్ కేర్ ప్రయోజనాలను పొందేందుకు తాజా అల్లంను వంటలో ఉపయోగించాలి. ఇది హానికరమైన టాక్సిన్స్‌ను తొలగించడంతో పాటు రక్త ప్రసరణను ప్రేరేపించడం ద్వారా చర్మం రూపాన్ని మెరుగుపరుస్తుంది. చర్మం మరిన్ని పోషకాలను పొందేలా చేస్తుంది.
3. చుండ్రు సమస్య దూరం:
చుండ్రును అల్లంతో కూడా నయం చేయవచ్చు. ఇందులోని క్రిమినాశక గుణాలు.. నేచురల్ ఈస్ట్, చుండ్రుకు కారణమయ్యే బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది. అల్లం నూనెను వారానికి రెండుసార్లు తలకు అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల చుండ్రు రాకుండా చూసుకోవచ్చు.
4. జుట్టు పెరుగుదల:
అల్లం మాడుకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది నేచురల్ కండిషనర్‌గా పనిచేస్తూ జుట్టును సిల్కీగా, మెరిసేలా చేస్తుంది. అల్లం జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. హెయిర్ రూట్, ఫోలికల్స్‌ను దృఢంగా మారుస్తుంది. అల్లంలో ఉండే అనేక ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు, ఖనిజాలు వెంట్రుకలను బలంగా మారుస్తూ జుట్టు రాలడాన్ని అడ్డుకుంటాయి.
5. మచ్చలు మాయం:
అల్లం యాంటీఆక్సిడెంట్లకు నిలయం. ఇవి టోనింగ్ ఏజెంట్‌గా పనిచేస్తాయి. చర్మం రంగు కంటే తక్కువ రంగులో ఉండే మచ్చలను అల్లం దూరం చేస్తుంది. దీని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మొటిమల కారణంగా ఏర్పడే మంట, మచ్చలను తగ్గిస్తాయి. ఈ సూపర్‌ఫుడ్ సహజమైన పదార్ధం. ఇది చర్మం సాగే గుణాన్ని మెరుగుపరుస్తూ, మృదువుగా చేస్తుంది.
అంతే కాకుండా చర్మ సంరక్షణకు,జుట్టు ఎదుగుదలకు అల్లంను వివిధ మార్గాల్లో ఉపయోగించవచ్చు. అల్లం ఎక్కువగా నూనె మార్కెట్లో దొరుకుతుంది. తాజా అల్లం రసాన్ని కూడా ఉపయోగించవచ్చు. లేదంటే అల్లం పొడిని కూడా వినియోగించవచ్చు.
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!