చియా గింజల గురించి అందరికి తెలుసు.. ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనం చూస్తూనే ఉన్నాం.. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడంలో బేషుగ్గా పని చేస్తాయి..ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియంలు కూడా ఉన్నాయి. ఇవి జీర్ణక్రియని మెరుగ్గా చేస్తాయి. దీంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి.. ఇప్పుడు వీటిని వాడి బెల్లీ ఫ్యాట్ ను ఎలా తగ్గించుకోవాలో చూద్దాం..
నిమ్మకాయ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.. కొవ్వుని కరిగించడంలో నిమ్మరసం కూడా బాగా పనిచేస్తుంది. అందుకోసం నీటిలో నిమ్మరసం కలిపి తాగడం మంచిది. దీని వల్ల శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియకి కూడా మంచిది. బాడీ నుండి ట్యాక్సిన్స్‌ని నిమ్మరసం దూరం చేస్తుంది. డైట్ ను ఫాలో అయ్యేవాళ్ళు రోజు నిమ్మరసం తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి..
అలాగే తేనె.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు బాడీలోని ఫ్యాట్‌ని తగ్గిస్తుంది. ఇందులోని గుణాలు శరీరానికి శక్తిని అందిస్తాయి. అయితే, తేనెని మితంగా తీసుకుంటే మంచిది.. ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారని తెలుస్తుంది.. ఇకపోతే ఈ మూడింటిని కలిపి తీసుకోవడం వల్ల అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు.. ఎలానో ఒకసారి చూద్దాం..
ఈ సూపర్ డ్రింక్ ను ఎలా తయారు చెయ్యాలంటే..
ముందుగా ఒక స్పూన్ చియా గింజలను తీసుకొని ఒక గ్లాస్ నీళ్లల్లో రాత్రి నానబెడితే మంచిది.. అందులోని తేనె, నిమ్మరసం కలపండి. తీపి ఇష్టం లేని వారు తేనె లేకుండానే తీసుకోవచ్చు. దాని బదులు దాల్చిన చెక్క పొడి కొద్దిగా వేసి గోరువెచ్చని నీరు కలిపి తాగండి.ఇలా రోజా తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.. త్వరగా బరువును తగ్గుతారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.