ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. కొన్ని పదార్థాలతో టీ చేసుకొని ఉదయాన్నే పరగడుపున తాగితే అధిక బరువును సులభంగా తగ్గించవచ్చు..వయసులో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, సుఖమయ జీవితానికి అలవాటు పడడం, ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడం, వ్యాయామం చేయకపోవడం వంటి వివిధ కారణాల చేత అధిక బరువు సమస్య తలెత్తుతుంది. అధిక బరువు కారణంగా మనం అనేక ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది..
బరువు పెరగడంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.. ముఖ్యంగా బీపీ, షుగర్, హార్ట్ ఎటాక్, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, రక్తనాళాల్లో పూడికలు ఏర్పడడం, థైరాయిడ్, కీళ్ల నొప్పులు, పైల్స్, మోకాళ్ల నొప్పులు, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక రకాల అనారోగ్య సమస్యలు మనల్ని ఇబ్బంది పెడతాయి..బరువు తగ్గడం కోసం బయట మార్కెట్ లో దొరికే వాటితో చాలా మంది ప్రయత్నిస్తారు..వీటిని వాడడం వల్ల ఫలితం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కానీ వీటిని వాడడం వల్ల మనం భవిష్యత్తుల్లో అనేక రకాల దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక మనం వీలైనంత వరకు సహజంగా ఈ సమస్య నుండి బయట పడడానికి ప్రయత్నించాలి..
ఈ బరువును తగ్గించుకోవడం కోసం కుంకుమ పువ్వు టీని తయారు చేసుకొని తాగవచ్చు..కుంకుమ పువ్వును, ఒక గ్లాస్ నీటిని, 10 పుదీనా ఆకులను, ఒక ఇంచు దంచిన అల్లం ముక్కను, రెండు నిమ్మకాయ ముక్కలను ఉపయోగించాల్సి ఉంటుంది.. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని తరువాత ఇందులో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి 10 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ నీరు గోరు వెచ్చగా అయిన తరువాత వడకట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇందులో ఒక టీ స్పూన్ తేనె కలిపి రోజూ ఉదయం తీసుకోవాలి. ఇలా టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తో పాటు ఇతర మలిణాలు కూడా బయటకు వస్తాయి..చర్మం కాంతి వంతంగా మారుతుంది.. మీకు నచ్చితే మీరు ట్రై చెయ్యండి..