Health Tips : చలికాలంలో ఈ జ్యూస్ ను తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చలికాలం అంటే జనాలు భయపడుతున్నారు.. అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.. ఇక చర్మం పొడి బారుతుంది… దాంతో మనం విటమిన్ సి ఎక్కువగా ఉండే వివిధ రకాల పండ్లల్లో మోసంబి కూడా ఒకటి. వీటిని జ్యూస్ గా చేసి తీసుకుంటూ ఉంటాము. మోసంబి జ్యూస్ పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది.. అంతేకాదు ఎన్నో రకాలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.. ఇతర పండ్ల రసాలను తాగినట్టుగా మోసంబి జ్యూస్ ను కూడా తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో తప్పకుండా తీసుకోవాలని వారు చెబుతున్నారు. మోసంబిలో విటమిన్ సి తో పాటు అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఈ పండ్లతో చేసిన జ్యూస్ ను తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.. అవేంటో ఒకసారి చూసేద్దాం..
ఈ జ్యూస్ ను చలికాలంలో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది..ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల పొట్టలో కదలికలు పెరుగుతాయి. మలబద్దకం సమస్య తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అలాగే ఈ జ్యూస్ ను తాగడం వల్ల నోట్లో ఉండే రుచి మొగ్గలు ఉత్తేజానికి గురి అవుతాయి. దీంతో నోటికి ఏదైనా తినాలన కోరిక కలుగుతుంది.. వాంతులు, వీరేచనాలు తగ్గుతాయి.. ఎనర్జీగా ఉంటారు.. రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది..
Also Read
- Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
- Kitchen Cleaning Tips: కొత్త పాత్రలపై ఉన్న మొండి స్టిక్కర్స్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్!
- Health Benefits of Silver : వెండి పాత్రలో నీరు తాగితే ఏమవుతుంది? కంగనా అలవాటు వైరల్.!
- Gym Tips : వర్కౌట్ మధ్యలో కోల్డ్ వాటర్.. మంచిదా? ప్రమాదమా.?
గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.. ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల శరీరం డీహ్రైడేషన్ కు గురి కాకుండా ఉంటుంది. చర్మం పొడి బారకుండా తేమను కలిగి ఉండేలా చేస్తుంది.. అలాగే శరీరంలో మలినాలు తొలగిపోతాయి. మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తగ్గుతుంది. ఇక జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, బరువు తగ్గడంలో కూడా ఈ జ్యూస్ మనకు సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలు ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని ప్రతి ఒక్కరు శీతాకాలంలో తీసుకునే ప్రయత్నం చేయాలని అప్పుడే వాతావరణ మార్పుల కారణంగా కలిగే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.. ఇంకా ఎన్నో సమస్యలు తగ్గిపోతయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
-
Kerala: “దీపం” వెలిగించడంపై రచ్చ.. వివాదంలో ముస్లిం మహిళా ఎమ్మెల్యే
-
TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
-
Anantha Sriram: “విషం కక్కే రివ్యూల దారిద్యాన్ని దాటి ‘పెద్ది’ బాక్సాఫీస్ బద్దలుకొట్టింది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!