ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. పెరిగినంత సులువుగా తగ్గడం చాలా కష్టం.. అయితే మన వంట గదిలో ఉండే కొన్ని వస్తువులతో బరువు తగ్గవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణం. వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్, నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోవడం, కూర్చొని పని చేయడం, శరీరానికి తగినంత శ్రమ లేకపోవడం వల్ల మొదలగు కారణాల వల్ల బరువు విపరీతంగా పెరిగిపోతాము..
అధిక బరువుతో ఇబ్బంది పడేవాళ్లు ఇంట్లో దొరికే వాటితో కషాయం తాగడం వల్ల సులువుగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.. ఆ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో.. ఎటువంటి పదార్థాలను వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. ఇందులోనే 15 పుదీనా ఆకులు, 5 లవంగాలు, అంగుళం దాల్చిన చెక్క ముక్క, అర టీ స్పూన్ అల్లం తురుము, 4 లేదా 5 నిమ్మకాయ ముక్కలు వేసి మరిగించాలి.. ఈ నీటిని సగం అయ్యేవరకు మరిగించాలి.. వాటిని చల్లార్చి గోరు వెచ్చగా ఉన్నప్పుడు వీటిని తీసుకోవడం మంచిది.. ఇలా రోజూ తీసుకోవడం వల్ల బరువును సులువుగా తగ్గుతారు.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్పెక్షన్ లు దరి చేరకుండా ఉంటాయి. శరీరంలో మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. ఈ కషాయాన్ని తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది.. ఇంకా ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.