Health Tips : గ్యాస్, కడుపులో మంట సమస్యతో భాధపడుతున్నారా? ఈ అద్భుతమైన చిట్కా మీ కోసమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని ఎవరు తీసుకోరు.. ఎందుకంటే అవి రుచిగా ఉండవు.. కేవలం నోటికి రుచిగా ఉండే ఆహారాన్ని తింటూ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.. మారిన ఆహారపు అలవాట్ల తో పాటు, టైం తినకపోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. సరైన సమయానికి భోజనం చేయకపోవడం, మసాలాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం, ప్రాసెస్ చేసిన ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల బారిన పడుతున్నారు.. ఈ సమస్యను చిటికెలో నయం చేసే అద్భుతమైన చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ చిట్కాను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. గ్యాస్, ఎసిడిటీ సమస్యలను దూరం చేసే ఈచిట్కాను ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ ధనియాలను, ఒక టీ స్పూన్ జీలకర్రను, 4 మిరియాలను, లవంగాలను, చిటికెడు పసుపును వేయాలి. ఈ నీటిని స్టవ్ మీద ఉంచి అర గ్లాస్ అయ్యే వరకు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ కషాయాన్ని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి.
Also Read
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
కాషాయం బాగా మరగ కాగిన తరువాత దీనిని వడకట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ కషాయాన్ని రోజుకు ఒకటి నుండి రెండు సార్లు తీసుకోవచ్చు. ఈ విధంగా కషాయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్యల నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. గ్యాస్, కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తిన వెంటనే ఈ కషాయన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. వారానికి కనీసం రెండు రోజుల పాటు ఈ కషాయాన్ని తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి.. అంతేకాదు శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల కడుపులో ఉండే పురుగులు నశిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో వేడి తగ్గుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల హార్మోన్లు విడుదలై ఆరోగ్యంగా ఉంటారు.. వారానికి రెండు సార్లు తాగితే మంచి లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!