Health Risks: పండ్లు, పాలు స్టీల్ పాత్రలో నిల్వ చేయడంతో ఎలాంటి సమస్యలొస్తాయో తెలుసా..
- సాధారణంగా ఇళ్లలో స్టీల్ పాత్రలనే ఎక్కువగా ఉపయోగిస్తారు
- కానీ వాటిని ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం
- పండ్లు, పాల ఉత్పత్తులు స్టీల్ గిన్నెల్లో నిల్వ చేయడం
- ఆరోగ్యానికి హానికరమంటున్ననిపుణులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా చాలా ఇళ్లలో స్టీల్ పాత్రలనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఎక్కువకాలం మన్నడం, శుభ్రంగా ఉండడం వల్ల మహిళలు వీటిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వంట చేయడానికి, నీరు నిల్వ చేయడానికి స్టీల్ పాత్రలు మంచివైనప్పటికీ, కొన్ని రకాల ఆహార పదార్థాలు ప్రత్యేకంగా పండ్లు, పాల ఉత్పత్తులు వాటిలో నిల్వ చేయడం ఆరోగ్యానికి హానికరమని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్టీల్ పాత్రల్లో ఆహారాన్ని ఎక్కువసేపు ఉంచినప్పుడు రసాయన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. నిమ్మ, నారింజ, ద్రాక్ష, బెర్రీలు వంటి సిట్రస్ పండ్లలో ఆమ్లత్వం అధికంగా ఉంటుంది. ఈ పండ్లను స్టీల్ పాత్రల్లో ఎక్కువసేపు ఉంచితే, అందులోని ఆమ్లం స్టీల్‌లో ఉండే నికెల్, క్రోమియం వంటి లోహాలతో చర్య జరపవచ్చు. దీని వల్ల ఆ లోహపు తత్వాలు స్వల్పంగా ఆహారంలోకి చేరే ప్రమాదం ఉంది. ఇవి దీర్ఘకాలంగా తీసుకుంటూ ఉంటే అజీర్తి, వికారం, అలెర్జీలు వంటి సమస్యలు రావచ్చు. అంతేకాక, ఆహారం సహజ రుచి మారి లోహపు రుచి వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
Also Read
- Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
- T-Shirt Hacks: మీ పాత టీ-షర్ట్‌లను పడేస్తున్నారా? ఒక్కసారి ఈ ట్రిక్ చూడండి.. 4 వస్తువులు ఫ్రీగా తయారు చేసుకోవచ్చు!
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
అలాగే, పెరుగు, మజ్జిగ, పాలు వంటి పాల ఉత్పత్తులు ఆమ్లత్వం కలిగి చాలా సున్నితమైనవి. స్టీల్ పాత్రల్లో వీటిని నిల్వ చేయడం వల్ల అవి త్వరగా పులిసిపోవడం లేదా పాడైపోవడం సాధారణం. పాల ఉత్పత్తులు కూడా స్టీల్‌తో చర్య జరపడంతో రుచి మారే అవకాశం ఉంది.
గాజు పాత్రలు ఎలాంటి రసాయన చర్యలకు లోనుకాకుండా ఆమ్ల ఆహారాలు, పాల ఉత్పత్తులను నిల్వ చేయడానికి ఉపయోగకరంగా ఉంటాయని నిఫుణులు చెబుతున్నారు. సిరామిక్ కంటైనర్లలో పండ్లు, వండిన ఆహారం, ఇతర పదార్థాలను నిల్వ చేసేందుకు ఉపయోగించువచ్చంటున్నారు. అయితే.. అత్యవసర పరిస్థితుల్లో బీపీఏ-రహిత ఫుడ్-గ్రేడ్ ప్లాస్టిక్ ఉపయోగించవచ్చన్నారు. ఈ సమాచారం అంతా మేము ఇంటర్నెట్ నుంచి గ్రహించాం. మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిఫుణులకు కలవడం ఉత్తమం.
- Tags
తాజావార్తలు
-
Chamari Athapaththu: కెప్టెన్ సంచలనం.. 5 పరుగులిచ్చి 7 వికెట్లు డౌన్..! హ్యాట్రిక్ కూడాను..
-
Strait of Hormuz: హోర్ముజ్ నుంచి యెమెన్ వరకు హైటెన్షన్.. 86 షిప్స్‌కు అమెరికా బ్రేక్!
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని ధన లాభాలు!
-
Congress Disciplinary Action: కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కొరడా.. నేడు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తప్పవా..?
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!