కొంత మంది రోజంతా బిజీగా ఉంటారు. వాళ్లకి జిమ్‌కు వెళ్లే టైం ఉండదు. వ్యాయామం కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించలేరు. అలాంటివాళ్లు ఫిట్‌నెస్ విషయంలో చింతించాల్సిన పనిలేదు. ఎందుకంటే వాళ్లు శారీరకంగా ఎలా ఆరోగ్యంగా ఉండాలో ఇప్పుడు చెప్పుకుందాం.
హెల్దీగా ఉండాలంటే.. ముందు.. వెయిట్ తగ్గాలి. ఒళ్లు బరువు తగ్గాలంటే శారీరకంగా కష్టపడాలి. దీనికోసం పొద్దున్నే ఎక్సర్‌సైజ్‌లు చేయాలని రూలేమీ లేదు. ఉదయం వేళల్లో చేయాల్సిన పనులన్నీ పూర్తయ్యాకే వ్యాయామం చేయొచ్చు. లేకపోతే.. ఒక్కో పనికి మధ్యలో పది నిమిషాల పాటు చిన్నపాటి ఎక్సర్‌సైజలు చేసినా సరిపోతుంది. దీంతో మన బాడీ యాక్టివ్‌గా ఉంటుంది.
ఇంట్లోనే ఒకటికి పది సార్లు అటూ ఇటూ నడవటం ద్వారా లేదా మెట్లు ఎక్కి దిగటం ద్వారా కూడా బరువు తగ్గొచ్చు. ఇలా చేస్తే కళ్లూ చేతులూ కీళ్లూ వాటిలోని కండరాలు, ఎముకలు దృఢంగా మారతాయి. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. నిద్ర పట్టకపోవటం అనే సమస్య నియంత్రణలోకి వస్తుంది.
ఇంట్లో ట్రెడ్ మిల్ లేకపోయినా.. అదే మోడల్‌లో.. ఉన్న చోటే నిలబడి వెనక్కీ ముందుకీ వాకింగ్ చేస్తే ఇంకా మంచిది. దీని వల్ల శరీరం మొత్తం కదులుతుంది. ఎక్సర్‌సైజ్ లాంటి రిజల్ట్ పొందొచ్చు. వాకింగ్‌కి ప్రత్యేకంగా ట్రాక్ సూట్లు, బూట్లు అవసరంలేదు. పాదరక్షలు లేకుండా కూడా నడవొచ్చు. అయితే.. అలా వాకింగ్ చేసే మార్గంలో గ్రీనరీ ఉండేట్లు చూసుకుంటే చాలు.
పచ్చిక బయళ్ల మీద నడిస్తే రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అదే పనిగా వాకింగ్ మరియు వర్కౌట్లు చేయకపోయినా ఇలాంటి చిన్న చిన్న వ్యాయామాలతో ఆరోగ్యంగా ఉండొచ్చు.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.