ఈరోజుల్లో నడుం నొప్పి చాలా సర్వసాధారణం అయిపోయింది. అధిక బరువు కారణంగానే నడుం నొప్పి ఎక్కువగా వేధిస్తుంటుంది. బరువు తగ్గితే సహజంగానే నడుం నొప్పి నుండి కూడా కాస్త ఉపశమనం లభిస్తుంది. కాబట్టి బరువు తగ్గటం పై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి. ప్రతిరోజు వ్యాయామం చేయడంతో పాటు, చిన్న చిన్న మార్పులతో నడుం నొప్పి ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.ఆధునిక జీవనశైలితో మనకు వచ్చే సమస్యలలో నడుము నొప్పి (Back Pain) ప్రధానమయినదని చెప్పాలి. గంటల తరబడి కూర్చుని పని చేయడం ద్వారా నడుము నొప్పి బారిన పడే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది.
నడుము నొప్పి మొదలుకాగానే నొప్పి నివారణ కొరకు మందులు వాడడం మొదలుపెడుతుంటారు. అది ఎంతమాత్రం మంచిది కాదు. కొన్ని రకాల ఆరోగ్య చిట్కాలు పాటిస్తే నడుము నొప్పికి చెక్ పెట్టవచ్చు. నొప్పిగా ఉన్న చోట ఐస్ ముక్కను కొంతసేపు పెట్టడం వల్ల కాస్త రిలీఫ్ లభిస్తుంది. ముఖ్యంగా కొన్ని రకాల క్రీడలు ఆడేవారు ఈ పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. మెడిసిన్ వాడాల్సిన పని లేకుండానే కింద ఇచ్చిన కొన్ని సహజ సిద్ధమైన ఆరోగ్య చిట్కాల (Health Tips)ను పాటించడం మందిచిది. నడుము నొప్పి తగ్గడానికి గ్లాసు పాలలో ఓ రెండు, మూడు చెంచాల తేనె వేసుకొని రోజూ తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
Read Also: Earthquake: ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భూకంపం.. ఈ నెలలోనే మూడో సారి
నొప్పి అధికంగా ఉన్న చోట అల్లం పేస్ట్‌ను కాసేపు ఉంచి తీసేస్తే ప్రయోజనం ఉంటుంది. చిన్న అల్లం నీటిలో వేసి వేడిచేయాలి. వడగట్టి చల్లార్చాలి. ఆ మిశ్రమంలో తేనె కలుపుకొని తాగితే ప్రయోజనం ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులు గంటకు ఓసారి లేచి కనీసం మూడు, నాలుగు నిమిషాలు నడవడం మంచిది. అదేపనిగా ఎక్కువ సేపు కూర్చోవడం ద్వారా నడుము నొప్పితో పాటు ఒబేసిటీ బారినపడే ప్రమాదం ఉంది. గ్లాసు పాలలో కొంచెం గసగసాల పొడి ప్రతిరోజూ ఒకసారి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. నడుం నొప్పి మీ దరికి చేరకుండా ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో నడుం నొప్పి ఉన్నప్పటికీ దానికి వెన్నుపాముతో ఎటువంటి సంబంధం ఉండదు. అలాగని అశ్రద్ధ చేయడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. నడుం నొప్పి ఉన్నప్పుడు వ్యాయామం (exercise) చేయవచ్చా లేదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాయామం చేయాలి. నడుం నొప్పి ఉన్నవారు వెన్నెముకకు బలాన్నిచ్చే వ్యాయామాలు రోజూ చేయాలి. దీని ద్వారా నడుం నొప్పికి చెక్ పెట్టవచ్చు. నడుముకు దెబ్బ తగిలినప్పుడు నొప్పి (pain), వాపు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో నొప్పి ఉన్న చోట చల్లని లేదా వేడి వాటితో కాపడం పెట్టడం వల్ల నడుం నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. నడుం నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు యోగ, ఈత వంటి సులభమైన వ్యాయామాలు చేయాలి.
నేలపై వెల్లకిలా పడుకుని శరీరానికి విశ్రాంతినిస్తే నడుం నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. కొన్ని పద్దతులలో కాళ్ళకు బరువులు వేలాడదీసి వెన్నుపూసలోని మార్పులను సవరించేలా చికిత్స అందించాలి. నడుం నొప్పికి యోగాసనాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇందులో ప్రత్యేకించి మకరాసనం, సర్పాసనం, భుజంగాసనం,వజ్రాసనం, చక్రాసనం, శలాభాసనాలు నడుం నొప్పి నివారణకు సహకరిస్తాయి. అయితే, నడుము నొప్పి తీవ్రంగా వున్నప్పుడు ఆసనాల జోలికి వెళ్ళకూడదు.
Read Also: TSRTC : వసంత పంచమి సందర్భంగా పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.