Site icon NTV Telugu

Urine: రాత్రుల్లో తరచూ మూత్రం వస్తుందా..? ఈ టిప్స్ పాటించండి..

Blood In Urine

Blood In Urine

శరీరంలో జరిగే ప్రతి మార్పు, అసౌకర్యానికి సంకేతం. అలాగే కొంతమందికి రాత్రిళ్లు పదే పదే మూత్రం వస్తుంటుంది. ఈ పరిస్థితి ఉన్నప్పుడు చాలా అసౌకర్యంగా ఉంటుంది. రాత్రిమూత్రం తగ్గటానికి జీవనశైలిని మార్చుకోవటం చాలా కీలకం. సమస్య ఒక మాదిరిగా ఉన్నవారికి ప్రధాన చికిత్స ఇదే. చాలావరకు దీంతోనే సమస్య కుదురుకోవచ్చు.

READ MORE: Houthi Rebels: అమెరికాకు హౌతీ రెబల్స్ వార్నింగ్.. ఇజ్రాయెల్‌కు సహకరిస్తే మీ నౌకలపై దాడి చేస్తాం

అవసరమైన దాని కన్నా ఎక్కువ నీరు తాగకుండా చూసుకోవటం ముఖ్యం. ద్రవాలు తీసుకోవటం తగ్గిస్తే మూత్రం ఉత్పత్తీ తగ్గుతుంది. కాబట్టి సాయంత్రం 7 గంటల తర్వాత ద్రవాలు తీసుకోవటం తగ్గించాలి. రాత్రి భోజనం చేసేటప్పుడు కొద్దిగా నీరు తాగొచ్చు. కెఫీన్‌, కూల్‌డ్రింకులు, మద్యం వంటివి మూత్రం ఎక్కువగా వచ్చేలా చేస్తాయి. వీటిని తగ్గించటం.. వీలైతే మానెయ్యటం మంచిది. నిద్ర పోవటానికి ముందే మూత్రాశయం పూర్తిగా ఖాళీ అయ్యేలా విసర్జన చేయాలి. నిద్రకు భంగం కలిగించే ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గించుకోవాలి. ఎందుకంటే నిద్రలోంచి మెలకువ వస్తే మూత్రం పోయాలని అనిపిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. బరువు అదుపులో ఉంచుకోవాలి. కాళ్ల వాపులుంటే పగటి పూట పొడవైన సాక్స్‌ వేసుకోవాలి.

READ MORE: Kannappa: కన్నప్ప మీద మీ అభిప్రాయాలను మీ వరకే ఉంచుకోండి..శరత్ కుమార్ కీలక వ్యాఖ్యలు

మరీ ఎక్కువ అయితే కష్టం..
రాత్రి మూత్రానికి కారణాన్ని బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. అసలు సమస్యను తగ్గిస్తే మూత్రం ఇబ్బందీ తొలగిపోతుంది.
ఇన్‌ఫెక్షన్‌ ఉంటే యాంటీబయాటిక్‌ మందులు వాడుకోవాల్సి ఉంటుంది. మూత్రాశయంలో రాళ్ల వంటివి ఉంటే చికిత్స తీసుకోవాలి. ప్రోస్టేట్‌ గ్రంథి ఉబ్బినవారికి ఆల్ఫాబ్లాకర్‌ రకం మందులు మేలు చేస్తాయి. అవసరమైతే శస్త్రచికిత్స చేసి గ్రంథి సైజును తగ్గించాల్సి ఉంటుంది. మూత్రాశయం అతిగా స్పందించేవారికి యాంటీకొలనెర్జిక్‌ మందులు ఉపయోగపడతాయి.
కొందరికి వ్యాసోప్రెసిన్‌ మాత్రలు అవసరమవ్వచ్చు. ఇవి మూత్రం ఉత్పత్తినే తగ్గిస్తాయి కాబట్టి నిద్రలోంచి ఎక్కువసార్లు లేవటమూ తగ్గుతుంది. అయితే వీటితో వృద్ధుల్లో సోడియం మోతాదులు తగ్గే ప్రమాదముంది. చిన్నవయసువారికైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందువల్ల 35-40 ఏళ్ల వారిలో సమస్య మరీ ఎక్కువగా ఉంటే వీటిని ఇవ్వచ్చు.

Exit mobile version