Veg Pulao Recipe: లంచ్ బాక్స్‌కు బెస్ట్ ఛాయిస్.. రెస్టారెంట్ స్టైల్ వెజ్ పులావ్.. ఇంట్లోనే ఈజీగా చేయండిలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Veg Pulao Recipe: ఇంట్లో మహిళలు ఉదయాన్నే లేచి పనులన్నీ చేస్తుంటారు. ఈ పనుల్లో అతి ముఖ్యమైనది, ప్రధానమైనది ఆఫీస్‌కు వెళ్లే భర్త లేదా స్కూల్‌కు వెళ్లే పిల్లలకు లంచ్ బాక్స్ రెడీ చేయడం. ఏదో ఒక ఫుడ్ ఐటమ్ వండి పెడదామంటే ఇష్టంగా తింటారో లేదో అనే సందేహం వస్తుంది. అందుకే అలాంటి వాళ్ల కోసం ఓ మంచి రెసిపీని తీసుకొచ్చాం. రుచికరమైన వెజ్ పులావ్‌ను ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
బియ్యం: 1 ½ కప్పుల బాస్మతీ బియ్యం (పాతవి అయితే మంచిది)
నూనె/నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
మసాలా దినుసులు: బిర్యానీ ఆకు (1), షాజీరా (¾ స్పూన్), యాలకులు (4), లవంగాలు (4), దాల్చిన చెక్క (2 అంగుళాలు), అనాస పువ్వు (1), జాపత్రి, జాజికాయ పొడి (చిటికెడు), సోంపు పొడి (అర స్పూన్).
కూరగాయలు: ఉల్లిపాయ (1 పెద్దది), పచ్చిమిర్చి (2), క్యారెట్ (ముక్కలు – ¾ కప్పు), బీన్స్ (½ కప్పు), పచ్చి బఠానీలు (½ కప్పు), బంగాళదుంప (1 మీడియం).
ఇతరాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్ (1 ½ స్పూన్), పుదీనా లేదా కొత్తిమీర (3 టేబుల్ స్పూన్లు), ఉప్పు (తగినంత).
నీళ్లు: కుక్కర్‌కు 2 ½ కప్పులు, గిన్నెలో అయితే 2 ¾ కప్పులు, ఇన్‌స్టంట్ పాట్‌కు 1 ¾ కప్పులు.
Also Read
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
- Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
- Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
తయారీ విధానం:
మొదట బియ్యాన్ని శుభ్రంగా కడిగి కనీసం 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత నీటిని పూర్తిగా వడకట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే కూరగాయలన్నింటినీ చిన్న ముక్కలుగా కోసి సిద్ధం చేసుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ లేదా మందపాటి గిన్నె పెట్టి, అందులో నెయ్యి లేదా నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక మసాలా దినుసులన్నీ (షాజీరా, యాలకులు, లవంగాలు మొదలైనవి) వేసి చిటపటలాడే వరకు వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు దోరగా వేగే వరకు వేయించుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు (సుమారు నిమిషం పాటు) వేగనివ్వాలి. తర్వాత కోసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు, పుదీనా ఆకులు వేసి 2-3 నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు నీళ్లు పోసి, తగినంత ఉప్పు వేయాలి. ఈ నీరు కొంచెం ఉప్పగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అన్నానికి ఉప్పు సరిగ్గా పడుతుంది. నీళ్లు బాగా మరిగిన తర్వాత, నానబెట్టి బియ్యాన్ని వేసి మెల్లగా కలపాలి. కుక్కర్‌లో అయితే మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆపేయాలి. ప్రెజర్ అంతా పోయాక మూత తీసి స్పూన్‌తో మెల్లగా కలపాలి. గిన్నెలో అయితే మూత పెట్టి సన్నని మంట మీద నీళ్లన్నీ ఇంకిపోయి అన్నం ఉడికే వరకు ఉంచాలి. స్టవ్ ఆపేసిన తర్వాత 15 నిమిషాల పాటు అలాగే వదిలేస్తే అన్నం పొడిపొడిగా వస్తుంది. అంతే టేస్టీ అండ్ హెల్తీ వెజ్ పులావ్ రెడీ..
తాజావార్తలు
-
Abhishek Sharma: అంతర్జాతీయ క్రికెట్లోనే ఇదే మొదటిసారి.. అభిషేక్ రికార్డు బ్రేక్ కాదేమో ఇగ!
-
Agniveer Jobs 2026: అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు.. రిజర్వేషన్, రూల్స్ ఇవే
-
OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
-
KTR: “రూ.1000 కోట్లు ఇస్తే మా ఆస్తులన్నీ ఇచ్చేస్తా”.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఆఫర్.. ..
-
IRUMUDI OTT : ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సెన్సషనల్ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’
ట్రెండింగ్
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?