NTV Telugu Site icon

Health: ఈ సమస్యలు ఉన్న వాళ్లు జామపండు తినొద్దు.. దూరంగా ఉంటే మంచిది

Guava Facts

Guava Facts

జామ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. అలాగే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఏంటాయి. జామపండు ఈ సీజన్‌లో ఎక్కువగా దొరుకుతుంది. అయితే.. జామపండ్లు అందరూ తినలేరు. వీటిని తింటే కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.

Madras High Court: ప్రేమలో ఉన్న టీనేజర్లు కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం సహజం..

ఈ సమస్యలు ఉన్న వాళ్లు తినకండి:
అసిడిటీ సమస్య:
కడుపులో ఆమ్లత్వం లేదా గ్యాస్ సమస్య ఉంటే జామపండుకు దూరంగా ఉండాలి. జామపండులో ఉండే యాసిడ్, ఫైబర్ కడుపులో ఎసిడిటీని పెంచి.. మంటను, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా దీన్ని ఖాళీ కడుపుతో తినడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది.

మలబద్ధకం రోగులు:
జామలో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే దీని గింజలను నమిలి తింటే మలబద్ధకం సమస్య పెరుగుతుంది. జామ గింజలు పేగులకు అంటుకుని జీర్ణక్రియలో సమస్యలను కలిగిస్తాయి.

కిడ్నీ వ్యాధిగ్రస్తులు:
కిడ్నీ సంబంధిత సమస్యల విషయంలో జామ పండు తీసుకోవడం తగ్గించాలి. జామపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. కిడ్నీ రోగులు వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే తినాలి.

డయాబెటిక్ పేషెంట్లు:
జామపండులోని తీపి సహజమే.. జామ పండు ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. చక్కెర లెవల్స్‌ను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి.

జలుబు, దగ్గు సమస్య ఉన్నవాళ్లు:
జామకు కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. దీనిని తింటే జలుబు, దగ్గు సమస్య పెరుగుతుంది. తరచుగా జలుబుతో బాధపడేవారు జామపండ్లను తినకూడదు.

Show comments