Chicken Biryani Recipe: చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్ ఫార్ములా.. నలుగురికి ఎంత బియ్యం, ఎంత చికెన్ వాడాలో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chicken Biryani Recipe: చికెన్ బిర్యానీ అంటే చిన్నా పెద్దా అందరికీ ఇష్టమైన వంటకం. పండుగలు, కుటుంబ వేడుకలు, స్నేహితుల గెట్టుగెదర్లు ఏవైనా బిర్యానీ ఉంటే ఆ సందడే వేరు. అయితే ఇంట్లో బిర్యానీ తయారు చేసేటప్పుడు చాలా మంది చేసే ప్రధాన పొరపాటు బియ్యం, చికెన్ నిష్పత్తిని సరిగ్గా పాటించకపోవడమే. ఫలితంగా రెస్టారెంట్లో లభించే రుచి ఇంట్లో రావడం కష్టమవుతుంది. అయితే, మంచి చికెన్ బిర్యానీకి అత్యంత ముఖ్యమైన విషయం చికెన్, బియ్యం సమాన నిష్పత్తిలో ఉండటం అంటున్నారు ప్రముఖ చెఫ్‌లు.. సాధారణంగా నలుగురు వ్యక్తులకు సరిపడే బిర్యానీ తయారు చేయాలంటే 500 గ్రాముల బాస్మతి బియ్యానికి 500 గ్రాముల చికెన్ వాడటం ఉత్తమమని సూచిస్తున్నారు. అయితే ఇంట్లో చికెన్ ఎక్కువగా ఇష్టపడే వారు ఉంటే, బియ్యం పరిమాణాన్ని 500 గ్రాములుగానే ఉంచి, చికెన్‌ను 750 గ్రాముల వరకు పెంచవచ్చు. ఇలా చేస్తే ప్రతి సర్వింగ్‌లో చికెన్ ముక్కలు సమృద్ధిగా ఉండి బిర్యానీ మరింత రుచికరంగా ఉంటుంది.
బిర్యానీ అన్నం ఉడికించడంలో జాగ్రత్త
బిర్యానీ తయారీలో మరో ముఖ్యమైన అంశం అన్నం ఉడికించే విధానం. చెఫ్ సూచనల ప్రకారం, బిర్యానీ కోసం బియ్యాన్ని పూర్తిగా ఉడికించకూడదు. మసాలాలు కలిపిన నీటిలో బియ్యాన్ని 70 నుంచి 80 శాతం మాత్రమే ఉడికించి వెంటనే వడకట్టాలి. ఇలా చేయడం వల్ల దమ్ ప్రక్రియలో అన్నం సరైన స్థాయిలో ఉడికి గింజ గింజ విడిగా ఉంటుంది.
Also Read
- Health Benefits of Eggs: ప్రతిరోజూ ఒక గుడ్డు తింటున్నారా..? శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే..
- Soya Manchurian: పిల్లలు లొట్టలేసుకుంటూ తినే 'మిల్ మేకర్ మంచూరియా'.. టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి!
- Crispy Bread Pakoda Recipe: పిల్లలు ఎగబడి తినే స్నాక్.. ఇంట్లోనే కరకరలాడే బ్రెడ్ పకోడా ఇలా తయారు చేసుకోండి!
- Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
ఉల్లిపాయల నిష్పత్తి కూడా ముఖ్యం
అర కిలో బియ్యానికి మూడు మధ్యస్థ పరిమాణంలో ఉన్న ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఎక్కువ ఉల్లిపాయలు వేస్తే బిర్యానీ తీపిగా మారే అవకాశం ఉంటుంది. అందుకే సరైన నిష్పత్తిని పాటించడం అవసరం.
హోటల్ స్టైల్ దమ్ రహస్యం
రెస్టారెంట్ తరహా బిర్యానీ సువాసనకు ప్రధాన కారణం దమ్ పద్ధతి. మందపాటి అడుగు ఉన్న పాత్రలో చికెన్, అన్నం పొరలుగా వేసిన తర్వాత మూతను పిండితో గట్టిగా మూసేయాలి. మొదట 5 నిమిషాలు ఎక్కువ మంటపై ఉంచి, తర్వాత కింద బరువైన పెనం పెట్టి 15 నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించాలి. మంట ఆర్పిన వెంటనే మూత తీసేయకుండా మరో 10 నిమిషాలు అలాగే ఉంచితే ఆవిరి ప్రభావంతో మసాలాల సువాసన చికెన్, అన్నంలో బాగా కలుస్తుంది. దీంతో ఇంట్లోనే హోటల్ స్టైల్ చికెన్ బిర్యానీని ఆస్వాదించవచ్చు. సరైన నిష్పత్తి, సరైన దమ్ పద్ధతి, నాణ్యమైన బాస్మతి బియ్యం ఉపయోగిస్తే ఇంట్లో చేసిన చికెన్ బిర్యానీ కూడా రెస్టారెంట్ రుచిని మించిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
-
Chicken Biryani Recipe: చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్ ఫార్ములా.. నలుగురికి ఎంత బియ్యం, ఎంత చికెన్ వాడాలో తెలుసా..?
-
Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
-
Jagapathi Babu: నువ్వు హీరో అయితే ఈసారి ఏం కట్ చేస్తావ్ బుచ్చిబాబూ? ?
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!