NTV Telugu Site icon

Weight Loss: ఈ డ్రింక్స్ తాగితే బరువు ఈజీగా తగ్గుతారు

Health1

Health1

ఉదయం అయితే చాలు కాఫీ, టీలో ఏదో ఒకటి పడాల్సిందే. లేదంటే దినచర్యలు సరిగా ప్రారంభం కావు. మీరు ఉదయం తాగే టీ మీ బరువును పెంచుతుందని మీకు తెలుసా? టీ వల్ల కలిగే అనర్థాలను దృష్టిలో ఉంచుకుని కొంతమంది టీ తాగడం మానేస్తుంటారు. కానీ ఇది శాశ్వతంగా చేయలేరు. కొద్దిరోజుల తర్వాత మళ్లీ టీ తాగడం ఆరంభిస్తారు. ఎండాకాలం టీ తాగడం తగ్గించి అందుకు ప్రత్యామ్నాయంగా మంచి పానీయం అలవాటు చేసుకుంటే మంచిది. ఇది మీ బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఆరోగ్యం కూడా బాగుపడతుంది.

నిమ్మరసం – వేడినీళ్ళు

టీకి ప్రత్యామ్నాయంగా మీరు నిమ్మరసం, వేడి నీళ్లు తాగండి. నిమ్మరసం బరువు తగ్గడానికి సులభమైన, అత్యంత ప్రభావవంతమైన పరిష్కారంగా డాక్టర్లు చెబుతుంటారు. నిమ్మరసం తాగడం వల్ల జీవక్రియ మెరుగవుతుంది. దీని వల్ల బరువు తగ్గుతారు. నిమ్మరసంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్ సి బాగా ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే ఉదయం వేడి నీటిలో నిమ్మరసం కలిపి తాగాలి. అలాగే చాలామంది నిమ్మరసంలో తేనె వేసుకుని తాగుతారు. ఇది కూడా మంచిదే.

జీరా వాటర్

ఆరోగ్యాన్ని పెంచడంలో మన వంటింట్లో వుండే వివిధ ఔషధాలు బాగా ఉపయోగపడతాయి. జీలకర్రను బాగా వేయించి తినడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. నిమ్మరసంలో జీలకర్రను కలిపి తాగితే మీలో చాలా మార్పు కనిపిస్తుంది. మనం వండే కూరల్లో జీలకర్రను వాడతాం. జీరా శరీర బరువును అదుపులో వుంచే శక్తి కలిగి వుంటుంది. ప్రతిరోజూ రెండుమూడుసార్లు జీరా నీరు తాగండి. ఆహారం ముగిశాక ఇది తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది. బరువు ని పెంచే కొవ్వు చేరకుండా పనిచేస్తుంది. రాత్రి నీటిలో ఒక చెంచా జీలకర్రను వేసి, ఆ నీటిని ఉదయం మరిగించి తాగాలి. వారం రోజుల పాటు జీరా వాటర్ తాగి చూడండి. మార్పు మీరే గమనిస్తారు.

సోంప్ వాటర్

కడుపులో బరువుగా అనిపించినా, అజీర్ణంతో బాధపడుతున్నా వెంటనే సోంపు నమలండి. లేదా నీటిలో సోంపు వేసి తాగితే మంచి ఫలితాలు కలుగుతాయి. నాన్ వెజ్, స్పైసీ ఫుడ్ తింటే కడుపు బరువు అనిపిస్తుంది. ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల ఆ రోజంతా చాలా అనీజీగా వుంటుంది. ఈ పరిస్థితినుంచి బయటపడడానికి సోంపు వాటర్ తాగండి. హోటల్స్ లో ఆహారం తిన్నాక, బిల్ కౌంటర్ పక్కనే సోంపు వుంచుతారు. అంతా అయిపోయాక ఒక గుప్పెడు సోంపు నోట్లో వేసుకుని నములుతూ వెళ్ళిపోవడం మనం చూస్తూ వుంటాం. క్రమం తప్పకుండా ఇది ఆచరిస్తే మీ శరీరం తేలికగా వుంటుంది. బరువు కూడా అదుపులో వుంచగలుగుతాం.

దాల్చిన చెక్క నీరు

మనం నాన్ వెజ్ కానీ ఏదైనా మసాలా కూర వండితే అందులో ఖచ్చితంగా దాల్చిన చెక్క వాడతాం. మన శరీరానికి దాల్చిన చెక్క ఎంతో మేలు చేస్తుంది. మార్నింగ్ టీకి బదులుగా గిన్నెలో వేడి నీళ్ళు వేసి దాల్చిన చెక్క ముక్కలు చేసి అందులో వేసి మరిగించాలి. తర్వాత దించి ఆ నీటిని గ్లాసులో వేసుకుని తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా 5 నుంచి 6 కేజీల బరువు తగ్గుతారు. ఇది ఆరోగ్యకరం కూడా.

అల్లం రసం

ఆహారంలో మనం ఎక్కువగా అల్లం వాడుతుంటాం. అల్లంలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వంటింట్లో అల్లం లేని వంటలు ఊహించలేం. అల్లం దంచి వచ్చిన రసాన్ని నీటిలో కలుపుకుని పరగడుపున తాగితే ఎంతోమంచిది. లావుగా వున్నవారు అల్లం రసం తాగితే వెంటనే మార్పు కనిపిస్తుంది. దంచిన అల్లంను వేడినీటిలో మరిగించి తాగాలి. ఇందులో కొందరు పంచదార కలుపుకుంటారు. అలా చేస్తే ఆశించిన ఫలితం లభించదు. అల్లంతో చేసిన మురబ్బా మనవాళ్ళు అమ్ముతుంటారు. అది కూడా తినవచ్చు. వీటిన్నటికంటే మనమే ఇంట్లో అల్లం మురబ్బా తయారుచేసుకోవచ్చు.

గ్రీన్ టీ

మీరు బరువు తగ్గాలని భావిస్తున్నారా? అయితే వెంటనే గ్రీన్ టీ తాగడం ప్రారంభించండి. బరువు తగ్గడానికి గ్రీన్ టీ తాగాలి. ఈ గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మీరు ప్రతిరోజూ ఉదయం టీకి బదులుగా గ్రీన్ టీ తాగితే బరువు తగ్గించుకోవచ్చు. శరీరంపై కొవ్వు పేరుకుపోదు. ఇందులో కొద్దిగా కెఫిన్ ఉంటుంది. ఇది మీకు శక్తిని పెంచుతుంది.

బ్లాక్ కాఫీ

మీకు టీ ఎక్కువగా తాగాలని అనిపిస్తే ఉదయం టీకి బదులుగా బ్లాక్‌ కాఫీ తాగవచ్చు. దీనివల్ల బరువు తగ్గుతారు. ఇందులో కెఫిన్ ఉంటుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. పని చేస్తున్నప్పుడు మీకు బద్ధకం అనిపించినప్పుడు మీరు ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగండి. కాఫీ తాగడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. అయితే బరువు తగ్గడానికి బ్లాక్ కాఫీ మాత్రమే ఉపయోగపడుతుంది. కనీసం వారానికి రెండుమూడుసార్లు బ్లాక్ కాఫీ తాగుతుంది.
Ntv Health: జ్ఞానదంతాలతో “జ్ఞానం” వస్తుందా..?