Madatha Kaja Recipe : స్వీట్ షాప్ స్టైల్లో జ్యూసీ మడత కాజాలు ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండిలా.!
- పొరలు పొరలుగా వచ్చే మడత కాజాల సీక్రెట్ ఇదే
- పాకం పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి
- తక్కువ ఖర్చుతో ఇంట్లోనే కాకినాడ స్టైల్ స్వీట్
- కరకరలాడే జ్యూసీ కాజాల కోసం ఈ చిట్కాలు తప్పనిసరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madatha Kaja Recipe : ఆంధ్ర స్వీట్స్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి కాకినాడ గొట్టం కాజాలు , మడత కాజాలు. పొరలు పొరలుగా కనిపిస్తూ, లోపల జ్యూసీగా ఉండే మడత కాజాలంటే ఇష్టపడని వారుండరు. వీటిని అచ్చం స్వీట్ షాప్ రుచితో, ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో ఎలా తయారు చేసుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
మడత కాజాల తయారీకి ప్రధానంగా మైదా పిండి అవసరం. సుమారు 250 గ్రాముల మైదా పిండికి మూడు టేబుల్ స్పూన్ల వేడి చేసిన నెయ్యి లేదా నూనెను సిద్ధం చేసుకోవాలి. పాకం కోసం రెండు కప్పుల పంచదార, యాలకుల పొడి , పాకం గడ్డకట్టకుండా ఉండటానికి ఒక టీస్పూన్ నిమ్మరసం అవసరమవుతాయి. అలాగే పొరల మధ్య చల్లుకోవడానికి కొద్దిగా కార్న్‌ఫ్లోర్ లేదా మైదాను పక్కన పెట్టుకోవాలి.
Also Read
- Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
పిండి , పాకం తయారీ
మొదట ఒక వెడల్పాటి పాత్రలో మైదా పిండి తీసుకుని, అందులో వేడి చేసిన నెయ్యి వేసి బాగా కలపాలి. పిండిని చేత్తో ముద్దలా పట్టుకుంటే ఆకారం వచ్చేలా ఉండాలి. అప్పుడే కాజాలు గుల్లగా వస్తాయి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి, చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకుని 20 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈలోగా పంచదారలో నీళ్లు పోసి తీగ పాకం కంటే కొంచెం తక్కువగా, అంటే చేత్తో పట్టుకుంటే జిగురుగా అతుక్కునేలా (Sticky consistency) పాకం పట్టుకోవాలి. ఇందులో యాలకుల పొడి, నిమ్మరసం కలిపి పక్కన పెట్టుకోవాలి.
పొరలు వచ్చేలా కాజాలను సిద్ధం చేయడం
నానిన పిండిని ఐదు సమాన భాగాలుగా చేసుకుని, ఒక్కో భాగాన్ని వీలైనంత పల్చటి చపాతీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీపై నూనె రాసి, దానిపై కార్న్‌ఫ్లోర్ చల్లాలి. దీనివల్ల పొరలు ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి. ఇలా ఐదు చపాతీలను ఒకదానిపై ఒకటి అమర్చి, గాలి చొరబడకుండా గట్టిగా రోల్ చేయాలి. చివర్లో కొంచెం నీళ్లు రాసి రోల్‌ను అంటించాలి. ఈ రోల్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, ఒక్కో ముక్కను చపాతీ కర్రతో లేదా వేలితో తేలికగా ఒత్తితే మడత ఆకారం వస్తుంది.
వేయించడం , పాకంలో ముంచడం
స్టవ్ మీద నూనె పెట్టి, అది తక్కువ వేడిలో ఉన్నప్పుడే కాజాలను వేయాలి. కాజాలు నెమ్మదిగా నూనెలో పైకి తేలే వరకు తక్కువ మంట మీదనే ఉంచాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్‌కు మార్చి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇలా వేయించిన వేడివేడి కాజాలను వెంటనే తీసి గోరువెచ్చని పంచదార పాకంలో వేయాలి. సుమారు 2-3 నిమిషాల పాటు పాకంలో ఉంచితే, కాజాలు పాకాన్ని పూర్తిగా పీల్చుకుని జ్యూసీగా తయారవుతాయి.
అంతే! ఎంతో రుచికరమైన, కరకరలాడే మడత కాజాలు సిద్ధం. పిండి కలిపేటప్పుడు నెయ్యి వేయడం, చపాతీలను పల్చగా ఒత్తుకోవడం , తక్కువ మంట మీద వేయించడం వంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే.. మీరు కూడా అచ్చం స్వీట్ షాప్ తరహాలోనే ఈ కాజాలను ఇంట్లోనే తయారు చేసి కుటుంబ సభ్యులను మెప్పించవచ్చు.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!