Tandoori Roti Recipe: తందూర్ లేకుండానే ధాబా స్టైల్ తందూరీ రోటీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసే చిట్కా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tandoori Roti Recipe: తందూరీ రోటీ అంటే చాలా మందికి ధాబాలు, రెస్టారెంట్ల రుచి వెంటనే గుర్తుకొస్తుంది. బయట భోజనం చేయడానికి వెళ్లినప్పుడు తందూరీ రోటీని ప్రత్యేకంగా ఆర్డర్ చేసే వారు కూడా చాలామందే ఉంటారు. కరకరలాడే పైపొర, స్వల్పంగా పొగ వాసన వచ్చే రుచి, వెన్న లేదా నెయ్యితో కలిసిన ఆ ఫ్లేవర్ భోజనానికి ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి. అయితే ఇలాంటి ధాబా స్టైల్ తందూరీ రోటీని ఇంట్లో తయారు చేయాలంటే తందూర్ లేదా ఓవెన్ తప్పనిసరిగా అవసరమని చాలామంది భావిస్తారు.
కానీ ఇప్పుడు కేవలం ఒక ఇనుప పెనం సహాయంతోనే ఇంట్లో రుచికరమైన తందూరీ రోటీని సులభంగా తయారు చేసుకోవచ్చు. సరైన విధంగా చేస్తే ఈ రోటీలు కూడా ధాబాలో దొరికే రుచిని ఇస్తాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, పిల్లలు ఈ రుచిని ఎంతో ఇష్టపడతారు. అంటే.. తందూర రోటీ కావాలంటే ధాబాకు వెళ్లాల్సిన అవసరం లేదు.. రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు..
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
కావలసిన పదార్థాలు
* 2 కప్పుల గోధుమ పిండి
* 3 నుంచి 4 టీస్పూన్ల పుల్లటి పెరుగు
* అర టీస్పూన్ బేకింగ్ సోడా లేదా బేకింగ్ పౌడర్
* 1 టీస్పూన్ చక్కెర
* 1 టీస్పూన్ నూనె
* తగినంత ఉప్పు
* అవసరమైనంత నీరు
* నెయ్యి లేదా వెన్న
* కొత్తిమీర ఆకులు లేదా నల్ల జీలకర్ర (ఐచ్ఛికం)
తయారీ విధానం
* ముందుగా ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండి తీసుకుని అందులో పుల్లటి పెరుగు, బేకింగ్ సోడా, చక్కెర, ఉప్పు వేసి బాగా కలపాలి.
* ఆ తరువాత కొద్దికొద్దిగా నీరు పోస్తూ మెత్తగా పిండి కలపాలి. పిండి సిద్ధమైన తర్వాత ఒక టీస్పూన్ నూనె రాసి ముద్దపై సమంగా పరచాలి.
* ఇప్పుడు ఆ పిండిని తడి గుడ్డతో కప్పి కనీసం అరగంట పాటు పక్కన ఉంచాలి. దీంతో పిండి మెత్తబడటంతో పాటు రోటీ మరింత మృదువుగా వస్తుంది.
* అరగంట తరువాత పిండిలోంచి చిన్న గడ్డ తీసుకుని చపాతీలా కొద్దిగా మందంగా ఒత్తాలి. కావాలంటే పైన కొత్తిమీర లేదా నల్ల జీలకర్ర చల్లుకోవచ్చు.
* ఇప్పుడు ఇనుప పెనాన్ని బాగా వేడి చేయాలి. రోటీ వెనుక భాగానికి కొద్దిగా నీరు రాసి, ఆ తడి భాగాన్ని పెనం మీద జాగ్రత్తగా అతికించాలి. కొద్దిసేపటికి రోటీపై బుడగలు రావడం మొదలవుతుంది.
* ఆ తరువాత పెనాన్ని తలక్రిందులుగా చేసి నేరుగా గ్యాస్ మంటపై తిప్పుతూ కాల్చాలి. రోటీపై గోధుమరంగు మచ్చలు వచ్చేవరకు బాగా కాల్చితే ధాబా స్టైల్ తందూరీ రోటీ సిద్ధమైనట్టే.
* చివరగా రోటీపై నెయ్యి లేదా వెన్న రాసి వేడి పప్పు, పనీర్ కర్రీ లేదా చికెన్ కర్రీతో వడ్డిస్తే అద్భుతమైన రుచి వస్తుంది. ఇకపై తందూరీ రోటీ కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే రెస్టారెంట్ రుచిని ఆస్వాదించవచ్చు.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!