ఇటీవలి కాలంలో వత్తిడి ఎక్కువై పోయింది. చిన్నవయసులోనే లేని పోని అనారోగ్యాలకు గురవుతోంది యువత. అందుకు కారణాలు లేకపోలేదు. ఈమధ్య డ్యాష్ డైట్ అనే పదం వినిపిస్తోంది. ఇంతకీ డ్యాష్ అంటే..డయటరీ అప్రోచెస్ టు స్టాప్ పర్ హైపర్ టెన్షన్ అని అర్థం. ఈ డైట్ లో భాగంగా ఆహారాల్లో వేసే ఉప్పు వాడకాన్ని బాగా తగ్గిస్తారు. పంచదార, సంతృప్త కొవ్వులు ఉండే పదార్థాలు తినడం బాగా తగ్గిస్తారు. వీటితోపాటు, పండ్లు, కూరగాయలు, కొవ్వు తక్కువగా ఉండే మాంసం, ఎండు ఫలాలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం చేస్తారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) మార్గదర్శకాల ప్రకారం రోజుకు -5 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు. 5 గ్రాముల ఉప్పులో ఉండే 2300 మిల్లీ గ్రాముల సోడియం మన శరీర అవసరాలకు చాలు. కానీ, మన ఆహారపు అలవాట్ల కారణంగా రోజుకు సగటున 10 గ్రాముల ఉప్పు తింటామని అంచనా. అంటే నిర్దేశిత ప్రమాణం కంటే రెట్టింపు ఉప్పు తినేస్తున్నామన్నమాట. ఈ ప్యాకేజ్డ్ ఆహారపదార్థాల్లో ఉప్పు మోతాదు చాలా ఎక్కువ కాబట్టి పిల్లలకు పండ్లు తినడం నేర్పించాలి.
పచ్చళ్ళు, స్నాక్స్ తినడం మానేయాలి. ఉప్పు అసలు మానేయడం కాదు. ఉప్పు తక్కువ మోతాదులో తినడం మంచిదే. అధికరక్తపోటు భయంతో చాలా మంది ఉప్పును బాగా తగ్గించేస్తారు. అది కూడా మంచిది కాదు. మనశరీరంలో ద్రవాలను సమతూకంగా ఉంచడంలో సోడియం పాత్ర చాలా ఎక్కువ. ఈ విషయం డాక్టర్లు, న్యూట్రిషనిస్టులు కూడా చెబుతారు. మనం తినే ఉప్పులో ఉండే సోడియం 40 శాతం, క్లోరిన్ 60 శాతం ఉంటాయి.
సోడియానికి నీటిని ఆకర్షించే గుణం ఉంటుంది. ఉప్పు ఎక్కువగా తింటే అందులో సోడియం అది రక్తనాళాల్లో ఎక్కువగా ద్రవాలు చేరడానికి కారణం అవుతుంది. దీనివల్ల రక్తపోటు పెరిగిపోతుంది. అందుకే ఉప్పు తగ్గించాలని రక్తపోటు బాధితులకు వైద్యులు సూచిస్తున్నారు. హై బీపీ ఉన్నవారు ఉప్పు వాడకం తగ్గించకపోతే గుండె నాళాలపై వత్తిడి పెరుగుతుంది. అది స్టంట్ వేయించుకునే వరకూ రావచ్చు.
Read Also: Manikrao Thakre : రెండ్రోజుల్లో హైదరాబాద్ కు కాంగ్రెస్ కొత్త ఇన్ ఛార్జి