మనలో చాలామంది ఆరోగ్యంగా, ఉత్సాహంగా, ఫిట్ నెస్ తో ఉండాలని భావిస్తారు. నిజం చెప్పాలంటే మనలో చాలా మంది ఆరోగ్యం పాడయిపోయిన తర్వాతే దాని గురించి ఆలోచిస్తారు. సేఫ్ పాడయ్యాక దానిని తిరిగి యథాతథంగా తేవాలనుకుంటారు. ఒక్కసారి ఆరోగ్యం పాడయితే దానిని సాధారణ స్థితికి తేవడానికి చాలా సమయం పడుతుంది. మనం ఏం చేసినా మన శరీరం హెచ్చరిస్తుంది. చాలాసార్లు మనల్ని క్షమిస్తుంది కూడా. కానీ మనం దాని గురించి ఆలోచించం. ఎన్నో సంవత్సరాలు భరించిన తర్వాత ఒకరోజు సమస్య బయటపడుతుంది.
మన ఆరోగ్యం బాగా ఉన్నప్పుడే మన ఆరోగ్యం మరియు ఫిట్ నెస్ గురించి పట్టించుకుంటే ఎలాంటి రోగాలు రాకుండా ఆనందంగా జీవించవచ్చు. వాకింగ్, రన్నింగ్, జాగింగ్ వంటి వాటిని క్రమం తప్పకుండా చేయాలి. ఎవరికోసమో చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి నుండి బయటపడవచ్చు. రోజువారిగా వ్యాయామాల వల్ల అనేక లాభాలను పొందవచ్చు. బరువు తగ్గుతారు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. డయాబెటిస్ కూడా తగ్గుతుంది. అయితే రోజూ వ్యాయామాలు చేసేవారు శక్తి కోసం కొన్ని ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే ఇంట్లో ఫిట్ నెస్ కి అవకాశం లేకుంటే జిమ్ కి మ్ లో వర్కవుట్స్ చేయడం వల్ల ఫిట్ నెస్ తో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ముఖ్యంగా అలసట నుండి దూరం చేస్తుందని చెప్పారు. తినకముందు ఎక్సర్ సైజ్ చేస్తే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుందని కోచ్ సమ్మన్న తెలిపాడు. ఖాళీ కడుపుతో ఎక్సర్ సైజ్ చేస్తే శరీరం ఇన్సులిన్ వాడకాన్ని సమర్థంగా వినియోగించుకుంటుంది. డయాబెటిస్ తో పోరాడి, జీవక్రియల వేగం పెంచేందుకు ఉపకరిస్తుందని చెబుతున్నారు.
Read Also: Shakuntalam: వెనక్కి వెళ్లిన శాకుంతలం… సమంతా ఫాన్స్ కి వెయిటింగ్ తప్పదు
జిమ్ కి వెళ్ళి కోచ్ సూచనలతోనే వర్కవుట్స్ చేయాలని లేదంటే అనేక ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు. జిమ్ కి ఒకటి రెండురోజులు వెళ్ళడం, తర్వాత నాలుగైదురోజులు మానేయం మంచిది కాదు. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం ఉండాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోజూ ఒక గంట వ్యాయామం చేయాలి. వ్యాయామం చేసేవారు ఖచ్చితంగా కొన్ని పానీయాలు ఆహారాలు తినాలి. రోజూ నిమ్మరసం తీసుకుంటే ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. రోజూ ఉదయాన్నే పరగడుపునే హెర్బల్ టీ లలో కలిపి తీసుకోవచ్చు. దీని వల్ల ఎముకలు ఆరోగ్యంగా తయారవుతాయి. వ్యాయామాలు చేసేవారు ఎలాంటి నొప్పులు, వాపులు రాకుండా ఉండాలంటే రోజూ చెర్రీ పండ్లను తినడం మంచిది.
రన్నింగ్ చేసేవారు రోజూ కచ్చితంగా తినాల్సిన ఆహారాల్లో అరటి పండు ప్రధానమయినదిగా చెబుతారు. దీనిని తినటం వల్ల కడుపు నిండిన భావన కలగడంతో పాటు త్వరగా జీర్ణం అవుతుంది. శరీరం తక్షణ శక్తిని పొందుతుంది. అరటి పండ్లలో విటమిన్ బి6 ఉంటుంది. అలాగే రన్నింగ్ చేసే అలవాటు ఉన్నవారు తప్పనిసరిగా వాల్ నట్స్ ను తింటే శక్తితోపాటు పోషకాలు లభిస్తాయి. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. అధిక బరువు తగ్గాలనుకునేవారు రోజూ రన్నింగ్ చేశాక వాల్ నట్స్ ను తినాలి. వ్యాయమం చేసేవారు మాత్రం మొక్కుబడిగా చేయకుండా ఖచ్చితంగా చేయాలి. అప్పుడే మీరు కోరుకున్న విధంగా మీ శరీరం మీకు సహకరిస్తుంది. అనారోగ్యాల బారిన పడకుండా ఉంటుంది.
Read Also: Jeelugu Kallu: జీలుగు కల్లు తాగిన గిరిజనులు.. ఒకరి మృతి
<p style=”font-size: 10px;”><span style=”color: red;”>నోట్ :</span> ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.</p>