High Protein Wheat Flour Roti: మీరు వాడే గోధుమ పిండిలో ప్రోటీన్ ఉందా..? ఇది ఒక్కటి కలిపితే చాలు.. రోటీ సూపర్ ఫుడ్‌గా మారుతుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Protein Wheat Flour Roti: ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న కొద్దీ చాలా మంది తమ రోజువారీ ఆహారంలో ప్రోటీన్ పరిమాణాన్ని పెంచాలని చూస్తున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు, జిమ్‌కి వెళ్లేవారు, కండరాలు పెంచుకోవాలనుకునేవారు, ఆరోగ్యంగా ఉండాలనుకునేవారికి ప్రోటీన్ చాలా అవసరం. అయితే, మార్కెట్లో లభించే ప్రోటీన్ పౌడర్లు చాలా ఖరీదైనవిగా ఉండటంతో అందరికీ అందుబాటులో ఉండవు. ఇలాంటి సమయంలో ఇంట్లోనే సులభంగా లభించే గోధుమ పిండిని అధిక ప్రోటీన్ పిండిగా మార్చుకోవచ్చు. ఇందుకు కేవలం ఒక పదార్థం కలిపితే సరిపోతుంది. అదే సోయా చంక్స్ పొడి.
గోధుమ పిండికి సోయా చంక్స్ కలిపితే ఏమవుతుంది?
సోయా చంక్స్‌లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే శాకాహారులకు ఇది మంచి ప్రోటీన్ వనరుగా భావిస్తారు. గోధుమ పిండిలో ప్రోటీన్ పరిమాణం తక్కువగా ఉండగా, సోయా చంక్స్ కలిపితే సాధారణ రోటీ కూడా పోషకాహారంగా మారుతుంది. 50 గ్రాముల గోధుమ పిండిలో 50 గ్రాముల సోయా చంక్స్ పొడి కలిపితే దాదాపు 30 గ్రాములకు పైగా ప్రోటీన్ లభించే అవకాశం ఉంటుంది. దీంతో రోజువారీ ప్రోటీన్ అవసరాలు తీర్చుకోవడంలో సహాయపడుతుంది.
Also Read
- Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ 'పప్పు చకోడీలు'.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
ఈ పిండిని ఎలా తయారు చేయాలి?
ముందుగా సోయా చంక్స్‌ను స్వల్పంగా వేయించాలి. దీంతో అందులోని తేమ తగ్గి సులభంగా పొడి చేయవచ్చు. తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు 50 గ్రాముల గోధుమ పిండికి సమాన పరిమాణంలో లేదా అవసరాన్ని బట్టి సోయా పొడి కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ పిండితో సాధారణంగా చపాతీలు, రోటీలు చేసుకోవచ్చు.
ఎందుకు గోధుమ పిండి అవసరం?
కేవలం సోయా పొడితో మాత్రమే రోటీ చేయడం కష్టమవుతుంది. అందుకే గోధుమ పిండి ఆధారంగా తీసుకుని అందులో సోయా పొడి కలపడం ఉత్తమం. ఇలా చేస్తే రోటీ మృధువుగా ఉండటంతో పాటు పోషక విలువలు కూడా పెరుగుతాయి.
ఆరోగ్య ప్రయోజనాలు
* ఈ హై ప్రోటీన్ పిండి కేవలం జిమ్‌కి వెళ్లేవారికే కాదు, ప్రతి ఒక్కరికీ ఉపయోగకరంగా ఉంటుంది.
* బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది
* ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఇస్తుంది
* కండరాలకు బలం అందిస్తుంది
* అలసట తగ్గిస్తుంది
* ఎముకలను బలపరుస్తుంది
* రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు సహాయపడుతుంది
మొత్తంగా ప్రోటీన్ కోసం ఖరీదైన సప్లిమెంట్లు కొనాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే గోధుమ పిండికి సోయా చంక్స్ పొడి కలిపి ఆరోగ్యకరమైన రోటీలు తయారు చేసుకోవచ్చు. రోజువారీ ఆహారంలో ఈ చిన్న మార్పు మీ ఆరోగ్యానికి పెద్ద మేలు చేస్తుంది.
తాజావార్తలు
-
Gunshots Fired: నందలూరులో నామినేషన్ల రగడ.. గాల్లోకి కాల్పులు, కార్లకు నిప్పు!
-
Harish Rao : ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కృత్రిమ కరువు
-
Anushka Shetty: రూటు మార్చిన స్వీటీ.. లేడీ ఓరియెంటెడ్ పక్కనపెట్టినట్టేనా?
-
Water Pollution: పాత వాటర్ ట్యాంక్‌తో వ్యాధుల బారిన పడుతున్నాం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మండవల్లి గ్రామస్థుల విజ్ఞప్తి..
-
Saudi Arabia: సౌదీ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత పౌరుడు మృతి..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!