Healthy Jackfruit Tacos : హెల్తీ మినీ జాక్‌ఫ్రూట్ టాకోస్.. టేస్టీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి.!
- జాక్‌ఫ్రూట్ టాకోస్తో హెల్తీ డైట్‌కు టేస్టీ ట్విస్ట్
- వెయిట్ లాస్‌కు బెస్ట్.. ఫైబర్‌తో నిండిన సూపర్ రెసిపీ
- గోచుజాంగ్ మేయోతో స్పైసీ అండ్ క్రీమీ ఫ్లేవర్
- ఐదు స్టెప్స్‌లో ఇంట్లోనే మెక్సికన్ స్టైల్ టాకోస్ రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Healthy Mini Jackfruit Tacos Recipe in Telugu : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హెల్తీ డైట్ ఫాలో అయ్యేవాళ్లకు, వెజిటేరియన్స్‌కు జాక్‌ఫ్రూట్ (పనసకాయ) ఒక బెస్ట్ ఆప్షన్ గా మారింది. చికెన్ లేదా మటన్ తిన్న ఫీలింగ్ ఇచ్చే టెక్స్చర్ దీని సొంతం. అలాంటి జాక్‌ఫ్రూట్‌తో మెక్సికన్ స్టైల్ ‘మినీ జాక్‌ఫ్రూట్ టాకోస్ విత్ చార్డ్ స్వీట్‌కార్న్ & గోచుజాంగ్ మేయో’ ఎలా తయారు చేసుకోవాలో, , దీనివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
జాక్‌ఫ్రూట్ టాకోస్ – హెల్త్ బెనిఫిట్స్ (Health Benefits)
Also Read
- Kitchen Tips: వెల్లుల్లి తొక్క తీయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ ఈజీ టిఫ్‌తో సెకన్లలో పని పూర్తి!
- Ragi Jaggery Cookies Recipe: మైదాకు గుడ్‌బై.. ఇంట్లోనే హెల్తీ రాగి-బెల్లం కుకీస్ తయారు చేయండిలా..
- Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ 'జీరా రైస్' ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
- Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా 'కారపన్నం' చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
వెయిట్ లాస్ ఫ్రెండ్లీ: జాక్‌ఫ్రూట్‌లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే హై ఫైబర్ కంటెంట్ వల్ల కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది, త్వరగా ఆకలి వేయదు.
డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది: ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది , మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
ఇమ్యూనిటీ బూస్టర్: పనసకాయ , లైమ్ (నిమ్మకాయ) లో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది బాడీ ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది.
న్యూట్రిషన్ ప్యాక్డ్: స్వీట్‌కార్న్ లో యాంటీఆక్సిడెంట్స్, పైనాపిల్‌లో విటమిన్స్ , ఎంజైమ్స్ ఉండటం వల్ల ఈ టాకోస్ ఓవరాల్ హెల్త్‌కు చాలా మంచిది.
కావలసిన పదార్థాలు (Ingredients)
గోచుజాంగ్ మేయో కోసం: 1 టీస్పూన్ గోచుజాంగ్ (కొరియన్ చిల్లీ పేస్ట్), 4 టేబుల్ స్పూన్లు మేయోనైస్.
టాకోస్ & స్టఫింగ్ కోసం: 1 స్వీట్‌కార్న్ కంకి, 4 లార్జ్ ఫ్లోర్ టోర్టిల్లాలు (చపాతీలు), ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్.
టాపింగ్స్ కోసం: 400 గ్రాముల కాన్డ్ జాక్‌ఫ్రూట్ (ఉడికించిన పనసకాయ ముక్కలు), పావు కప్పు పైనాపిల్ ముక్కలు (సన్నగా తరిగినవి), అర కట్ట కొత్తిమీర తరుగు, 1 రెడ్ చిల్లీ (సన్నగా తరిగినది), 1-2 లైమ్ ముక్కలు.
తయారీ విధానం (Step-by-Step Method)
స్టెప్ 1: గోచుజాంగ్ మేయో & స్వీట్‌కార్న్ ప్రిపరేషన్
ముందుగా ఒక బౌల్లో గోచుజాంగ్ పేస్ట్ , మేయోనైస్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్వీట్‌కార్న్ కంకిని ఒక 5 నిమిషాల పాటు నీళ్లలో ఉడికించి, ఆపై ఆరబెట్టి డ్రై చేయాలి. దీన్ని స్టవ్‌పై లేదా గ్రిల్‌పై ఒక 10 నిమిషాల పాటు చుట్టూ నల్లటి మచ్చలు వచ్చేలా (కాల్చిన అట్లు) బాగా గ్రిల్ చేయాలి. చల్లారిన తర్వాత గింజలను వలిచి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 2: మినీ టోర్టిల్లాస్ రెడీ చేయడం
తీసుకున్న పెద్ద ఫ్లోర్ టోర్టిల్లాలను (చపాతీలను) ఒక 9 సెం.మీ కట్టర్ లేదా గిన్నె సాయంతో చిన్న చిన్న రౌండ్ ముక్కలుగా (మినీ టోర్టిల్లాస్) కట్ చేసుకోవాలి. మిగిలిపోయిన ఎక్స్ట్రా ముక్కలను చిన్న పీస్‌లుగా కట్ చేసి, ఆయిల్లో 1 నిమిషం పాటు క్రిస్పీగా అయ్యేలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 3: జాక్‌ఫ్రూట్ స్టఫింగ్ మిక్సింగ్
కాన్డ్ జాక్‌ఫ్రూట్ లోని నీటిని పూర్తిగా తీసేసి, ఆ ముక్కలను మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ‘గోచుజాంగ్ మేయో’ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. దీనివల్ల జాక్‌ఫ్రూట్ ముక్కలకు మంచి స్పైసీ అండ్ క్రీమీ ఫ్లేవర్ వస్తుంది.
స్టెప్ 4: టాకోస్ అసెంబ్లింగ్ & సర్వింగ్
చిన్నగా కట్ చేసుకున్న మినీ టోర్టిల్లా రౌండ్స్‌ను మైక్రోవేవ్‌లో 1 నిమిషం పాటు వేడి చేసి ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టాలి. ఇప్పుడు ప్రతి టోర్టిల్లా మధ్యలో ఈ మేయో జాక్‌ఫ్రూట్ మిశ్రమాన్ని ఉంచాలి. దానిపై సన్నగా తరిగిన పైనాపిల్ ముక్కలు, కొత్తిమీర, రెడ్ చిల్లీ ముక్కలను చల్లాలి. పైనుంచి కొద్దిగా నిమ్మరసం పిండాలి. చివరగా గ్రిల్ చేసిన స్వీట్‌కార్న్ గింజలు , ఫ్రై చేసి పెట్టుకున్న క్రిస్పీ టోర్టిల్లా పీస్‌లను టాపింగ్‌గా వేయాలి.
అంతే.. ఎంతో కలర్‌ఫుల్ గా, క్రంచీగా ఉండే హెల్తీ మినీ జాక్‌ఫ్రూట్ టాకోస్ రెడీ! డైట్ లో ఉంటూ వెరైటీగా, టేస్టీగా తినాలనుకునే వాళ్లకు ఇది ఒక పర్ఫెక్ట్ డిష్.
తాజావార్తలు
-
Kapil Dev: “బాధ ఎందుకు.. పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి”.. రోహిత్ రిటైర్మెంట్పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
-
Anaconda vs Python: అనకొండా, కొండచిలువ ఒకటే అనుకుంటున్నారా? అసలు తేడా ఇదే!
-
Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
-
KTR : స్థానిక యువతకు 95 శాతం ఉద్యోగాలు సాధించింది కేసీఆరే
-
Maheshwara Reddy: రివ్యూలపై ‘ఓ సుకుమారి’ నిర్మాత షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!