NTV Telugu Site icon

Health Benefits: ఈ చెట్టు పండ్లు, ఆకులలో ఆరోగ్య నిధి.. ఎన్ని బెనిఫిట్స్ అంటే..?

Passion Fruit

Passion Fruit

పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరికి తెలిసిందే.. ఎందుకంటే పండ్లలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఒక్కో పండులో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. సాధారణంగా మనం యాపిల్, అరటి, మామిడి, జామ వంటి పండ్లను మాత్రమే ఎక్కువగా తింటుంటా. ఈ పండ్లతో పాటు మరో ప్రత్యేకమైన పండు కూడా ఉంది. ఇది తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదే.. కృష్ణ పండు(పాషన్ ఫ్రూట్). ఇది ఆరోగ్యానికి చాలా మంచింది.

ఈ పండు తీనడం వల్ల అనేక వ్యాధులు నయం అవుతాయి. పాషన్ ఫ్రూట్‌లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని రోజూ తినడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. అంతేకాకుండా.. ఊబకాయం వంటి సమస్యలను కూడా అరికడుతుంది. ఈ పండు కేవలం షుగర్‌కే కాకుండా కొలెస్ట్రాల్ రోగులకు కూడా ఎంతో మేలు చేస్తుంది.

Read Also: IND vs SA: నేటి మ్యాచ్‌లో సంజూ శాంసన్ చరిత్ర సృష్టించే అవకాశం.. అలా చేస్తే..!

పాషన్ ఫ్రూట్ ప్రయోజనాలు:
పాషన్ ఫ్రూట్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. దీనిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదల రేటును తగ్గిస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. పాషన్ ఫ్రూట్‌లో శరీరానికి అవసరమైన అన్ని పొటాషియం, మెగ్నీషియం, కెరోటినాయిడ్స్, పాలీఫెనాల్స్ ఉంటాయి.

నిద్ర సమస్యలు దూరమవుతాయి:
పాషన్ ఫ్రూటే కాకుండా.. ఈ పండు ఆకుల రసం వల్ల కూడా లాభాలు ఉన్నాయి. దీని ఆకుల రసం తాగడం వల్ల నిద్రలేమి సమస్యను పరిష్కరించుకోవచ్చు. దీని ఆకులలో ఉండే ఆల్కలాయిడ్స్ నిద్రను ప్రేరేపిస్తాయి. అంతేకాకుండా.. శరీరంలో జీవక్రియను బలపరుస్తుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉంటాయి. అంతేకాకుండా.. ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను తొలగిస్తుంది.

గుండె ఆరోగ్యం, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటాయి:
ఈ పండును తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. తక్కువ సోడియం, అధిక పొటాషియం సమృద్ధిగా ఉండే ఈ పండు రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె జబ్బులను నివారిస్తుంది. అంతేకాకుండా.. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో కూడా ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

Show comments