పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరికి తెలిసిందే.. ఎందుకంటే పండ్లలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఒక్కో పండులో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. సాధారణంగా మనం యాపిల్, అరటి, మామిడి, జామ వంటి పండ్లను మాత్రమే ఎక్కువగా తింటుంటా. ఈ పండ్లతో పాటు మరో ప్రత్యేకమైన పండు కూడా ఉంది. ఇది తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.