NTV Telugu Site icon

ABC Juice: పెరుగుతున్న పిల్లలకు ABC జ్యూస్ ఇవ్వండి.. చదువులో దూసుకుపోతారు..!

Abc Juice

Abc Juice

మీ పిల్లల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కోసం మీరు ఎంతో కష్టపడుతుంటారు. పిల్లల ఆరోగ్యం కోసమని పోషకమైన వంటకాలు, పండ్లను ఇస్తుంటారు. వాటితో పాటు ABCని కూడా ఇస్తే చదువులో దూసుకుపోతారు. అంతేకాకుండా.. చలికాలంలో పిల్లలకు ABC జ్యూస్ చాలా మంచింది. అసలు ABC జ్యూస్ అంటే.. ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్ జ్యూస్. ఇది A నుండి Z వరకు ప్రతి రకమైన పోషకాల లోపాన్ని తీరుస్తుంది. ABC జ్యూస్ తాగడం వలన పిల్లలకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం….

Harassment: బాలికపై వేధింపులు.. క్రషర్లో వేసి హత్యకు పాల్పడ్డ నిందితులు

బలమైన రోగనిరోధక శక్తి
విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా ఉండే ఈ జ్యూస్‌ని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా.. ఈ రసంలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇది శరీరం లోపల జరిగిన నష్టాన్ని త్వరగా సరిచేస్తుంది.

జీర్ణక్రియ కోసం
యాపిల్, బీట్‌రూట్, క్యారెట్ లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

శరీర నిర్విషీకరణ
ABC జ్యూస్ తాగడం వల్ల శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు వెళ్లవు. ఈ రసంలో ఉండే ఫైబర్స్ కారణంగా టాక్సిన్స్ సులభంగా కరిగిపోతాయి.

కంటి చూపును మెరుగుపరుస్తాయి
ABC జ్యూస్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో విటమిన్ ఎ తగినంతగా ఉంటే.. కంటి చూపు కూడా బాగుంటుంది. అందువల్ల ఈ రసం చాలా ప్రయోజనకరమైనదని చెబుతున్నారు.

చర్మాన్ని అందంగా మారుస్తుంది
ఈ జ్యూస్ తాగడం వల్ల మీ చర్మం యంగ్ గా, హెల్తీగా మారుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి రక్షించడమే కాకుండా లోపలి నుండి మెరుపును కూడా పెంచుతాయి. ఇవి చర్మాన్ని మాత్రమే కాకుండా మొత్తం శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. దానివల్ల నిజమైన గ్లో లోపల నుండి వస్తుంది.