Garlic For Good Health: వెల్లుల్లితో ఆరోగ్యం మెరుగు.. రోజూ తినండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనలో చాలామందికి కొన్ని రకాల ఆహారపదార్ధాలు, చిరుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు తినడం అంతగా అలవాటు ఉండదు. అందులో ముఖ్యమైంది వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కేవలం మాంసాహారం, చేపలు వంటివి తిన్నప్పుడు మాత్రమే వాడతారు. కానీ అల్లం, వెల్లుల్లిని విడిగా రోజువాడితే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలీదు. వెల్లుల్లిలో విటమిన్లు B1, B2, B3, B6, ఫోలేట్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి వంటి పోషకాలెన్నో ఉంటాయి.
వెల్లుల్లిని ఏ రూపంలోనైనా మన డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, పచ్చి వెల్లుల్లిని ఉదయం పూట తిని నీళ్లు తాగితే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. వెల్లుల్లిని ఎక్కువగా నూనె, క్రొవ్వు పదార్థములు తినేవారు వెల్లుల్లి తప్పని సరిగా వాడాలి. వెల్లుల్లి మాంసాహారం మరియు ఇతర క్రొవ్వు పదార్ధములలో ఉన్న క్రొవ్వునకు విరుగుడుగా పని చేస్తుంది. గుండె జబ్బులను రానివ్వదు. వెల్లుల్లి పట్టు వేసిన తలనొప్పి, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. వెల్లుల్లిని పాలతో కలిపి ఉడికించి త్రాగించిన అస్తమా, క్షయ, నిమోనియా తగ్గుతాయి. జలుబు తగ్గుతుంది. వెల్లుల్లిని రోజూ వాడేవారు తక్కువగా అనారోగ్యం బారిన పడతారని డాక్టర్లు చెబుతున్నారు.
Also Read
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
ఆయుర్వేదములో వెల్లుల్లి రసాయనంగా వాడాలని చెబుతారు. పక్షవాతము మొదలుకొని కుష్ఠు, గుండె జబ్బులు, కీళ్ళ నొప్పులు, జ్వరము, జీర్ణాశయ వ్యాధులు మొదలైన అనేక వ్యాధులలో వెల్లుల్లికి మించిన ఔషధం లేదు. వెల్లుల్లి అత్యుత్తమమైన జీర్ణకారిగా పనిచేస్తుంది. గుండె జబ్బులు కలవారు బాగా లావుగా ఉన్నవారు ప్రతిరోజూ రెండు లేక మూడు చిన్నపాయలను తీసుకుంటే లావు తగ్గుతారు. స్త్రీలలో కలిగే వ్యాధులలో వెల్లుల్లి అత్యుత్తమంగా పని చేస్తుంది. ఋతు దోషములను పోగొట్టి సంతానాన్ని కలిగిస్తుంది. ఊపిరితిత్తుల వ్యాధులలో వెల్లుల్లిని పాలతో కలిపి ఉడికించి త్రాగించిన ఆస్త్మా, క్షయ, నిమోనియా తగ్గుతాయి. జలుబు తగ్గుతుంది.
Read Also: Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
చర్మానికి కాంతి కావాలంటే వెల్లుల్ని వాడాలి. వెల్లుల్లిపాయలను దంచి ఆ రసాన్ని 10 చుక్కల చొప్పున రోజుకి రెండు సార్లు త్రాగిస్తే పిల్లలకు కలిగే కోరింత దగ్గు తగ్గుతుంది. శుక్రకణాలు తక్కువగా ఉండి, సంతాన సాఫల్యత కోసం ఎదురుచూసే వారు వెల్లుల్లిని ఎక్కువగా వాడమని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. చాలామంది చెవిపోటుతో బాధపడుతూ ఉంటారు. అలాంటివారు వెల్లుల్లిని వాడితే చెవిపోటు నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. ఏ పదార్ధాన్ని ఎక్కువగా తీసుకోకూడదు. వెల్లుల్లి అతిగా తింటే రక్తస్రావం, రక్తంతో కూడిన వాంతులు, రక్త విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తగు మోతాదులో జాగ్రత్తగా సేవిస్తే అమృతంలా పనిచేస్తుంది. మన శరీరం తత్వాన్ని బట్టి వెల్లుల్లిని సేవించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
తాజావార్తలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
-
Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!